
ఆర్ఆర్ఆర్ మూవీ మరో రెండు రోజుల్లో పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న వేళ సోషల్ మీడియాలో #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ అవ్వడం అందర్నీ షాక్ లో పడేస్తుంది.కన్నడిగులను దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అవమానిస్తున్నాడని, ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కర్ణాటకలో నిషేధించాలని ట్విట్టర్ వేదికగా పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ కన్నడలో కాకుండా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారని, అందుకే తాము మూవీని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నామని కొందరు నెటిజన్లు చెపుతున్నారు. అయితే, ఈ విషయంలో రాజమౌళికి ఎటువంటి సంబంధం లేదని మరికొందరు రిప్లయి ఇస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ వారిని ఈ విషయమై అడగాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఈ హ్యాష్ ట్యాగ్ మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.