
దర్శకుడిగా బోయపాటి శ్రీనుది ప్రత్యేకమైన శైలి. మాస్ కథలతోనే సూపర్ హిట్లు అందుకుంటాడు. అయితే తన ఫార్ములా ప్రేక్షకులకు బోర్ కొట్టిందో ఏమో గత కొన్ని చిత్రాలుగా వావ్ అనిపించే సూపర్ హిట్ ను సాధించలేకపోయాడు. బోయపాటి లాస్ట్ సినిమా వినయ విధేయ రామ ఎలాంటి ఫలితం అందుకుందో మనం చూసాం.
అయితే తన లేటెస్ట్ సినిమా అఖండ చిత్రంతో తిరిగి పూర్వపు బజ్ ను సాధించాడు. అఖండ చిత్రం మీద ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. లాక్ డౌన్ సమయంలో తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం బోయపాటి ఇద్దరు హీరోలను అప్రోచ్ అయ్యాడు. ఒకరు రవితేజ, మరొకరు అల్లు అర్జున్. ఇద్దరూ గతంలో బోయపాటితో సినిమా చేసిన వారే. అయితే ఇద్దరూ కూడా బోయపాటితో సినిమా అనగానే పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. మరి ఇద్దరిలో బోయపాటి ఎవరితో సినిమాను ముందుకు తీసుకెళతాడో అన్నది చూడాలి.