Tuesday, August 9, 2022
Homeటాప్ స్టోరీస్అఖండ డైరెక్టర్ తో సూర్య..

అఖండ డైరెక్టర్ తో సూర్య..

Boyapati Srinu to direct Suriya
Boyapati Srinu to direct Suriya

అఖండ మూవీ తో భారీ హిట్ అందుకున్న యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..సూర్య అభిమానుల్లో ఆనందం నింపారు. సూర్య తో ఖచ్చితంగా ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సూర్య..మార్చి 10 న ఈటీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని పాండిరాజ్ డైరెక్ట్ చేయగా.. సన్ పిక్చర్ బ్యానర్‌లో కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మాస్ అండ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ లో సూర్య కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది.

- Advertisement -

చిత్ర ప్రమోషన్ లో భాగంగా గురువారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో రానా దగ్గుబాటి, అగ్ర నిర్మాత సురేశ్ బాబు, దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ..’సూర్య, నేనూ కలిసి తప్పకుండా ఓ సినిమా చేస్తాము. ఈ మూవీ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను కానీ మా కాంబినేషన్‌లో ఖచ్చితంగా ఓ సినిమా ఉంటుంది అని అన్నారు. ఇక అదే సమయంలో తెలుగు ప్రేక్షకులు సూర్యను తమిళ హీరోగా కాకుండా తమలో ఒకరిగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. బోయపాటి వ్యాఖ్యలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి..త్వరలో హీరో రామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts