Homeటాప్ స్టోరీస్కోలీవుడ్ లో మామ – అల్లుళ్ళ సవాల్?

కోలీవుడ్ లో మామ – అల్లుళ్ళ సవాల్?

కోలీవుడ్ లో మామ – అల్లుళ్ళ సవాల్?
కోలీవుడ్ లో మామ – అల్లుళ్ళ సవాల్?

రజనీకాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక స్టార్ గా ఎంత ఎత్తులో కనిపిస్తాడో, ఒక వ్యక్తిగా అంతకు మించి లోతు ఉన్న మనిషి . ఇక ధనుష్, పరిచయం అవ్వడానికి సూపర్ స్టార్ అల్లుడు అనే బ్రాండ్ తో మొదట మార్కెట్ లోకి దిగినా తర్వాత, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. చేసే సినిమాలలో ఒకదానికొకటి సంబంధం లేకుండా, అన్నిరకాల పాత్రలు వేస్తూ, కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక 2020 సంక్రాంతి బరిలో పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఈ మామ & అల్లుళ్ళు. సంక్రాంతికి రజనీకాంత్ దర్బార్ భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ కాగా, ఆ తర్వాత వరం గ్యాప్ తో ధనుష్ కొత్త సినిమా పటాస్ వస్తోంది. వరం గ్యాప్ తో వస్తున్నా, రజనీకాంత్ సినిమా హిట్ అయ్యింది అంటే, కనీసం 2 వారాల పాటు ఇక ఏ సినిమాను జనం కనీసం పట్టించుకోరు. గత ఏడాది అయితే ఒక వైపు పేట మరోవైపు విశ్వాసం సినిమాలు రెండు హిట్ టాక్ వచ్చేసరికి ఇక మిగిలిన సినిమాలు కంటెంట్ బాగున్నా జనాలు ఆదరించలేదు. చూద్దాం.. బాక్సాఫీస్ సాక్షిగా జరగ బోయే ఈ మామ & అల్లుళ్ళ సవాల్ లో ఎవరు గెలుస్తారో..?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All