
డిగ్రీ కాలేజ్ అనే బూతు సినిమా ట్రైలర్ వచ్చేసింది . అవార్డు విన్నింగ్ దర్శకుడు నరసింహ నంది ఈ బూతు చిత్రానికి దర్శకుడు కావడం విశేషం . హీరో , హీరోయిన్ లుగా కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ డిగ్రీ కాలేజ్ అనే సినిమాని రూపొందించాడు నరసింహ నంది . నిన్న సాయంత్రం ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు . అయితే ఈ ట్రైలర్ నిండా బూతులే బూతులు ఉన్నాయి . వీర లెవల్లో శృంగార సన్నివేశాలు ఉన్నాయి .
హీరోయిన్ హీరో మీద పడి మరీ చేసే శృంగార సన్నివేశాలు , లిప్ లాక్ లు కుర్రాళ్ళని విపరీతంగా అలరించడం ఖాయం . అయితే ఇదే ధోరణి కొంతకాలంగా సాగుతోంది . అందునా మంచి చిత్రాలను అందించిన నరసింహ నంది లాంటి దర్శకుడు ఈ బూతు సినిమాకు దర్శకుడు కావడంతో ముక్కున వేలేసుకుంటున్నారు . మొత్తానికి ఈ డిగ్రీ కాలేజ్ ట్రైలర్ యువతని మాత్రం విపరీతంగా అలరించేలా కనబడుతోంది .