Homeటాప్ స్టోరీస్‘బుక్ మై షో’ నువ్వు అంత తోపు ఆ? సినిమా గురించి నీకెందుకు?

‘బుక్ మై షో’ నువ్వు అంత తోపు ఆ? సినిమా గురించి నీకెందుకు?

‘బుక్ మై షో’ నువ్వు అంత తోపు ఆ? సినిమా గురించి నీకెందుకు?
‘బుక్ మై షో’ నువ్వు అంత తోపు ఆ? సినిమా గురించి నీకెందుకు?

ఒకప్పుడు సినిమా కి వెళ్ళాలి అంటే ఒక 1 గంట ముందో? లేక ఒక పుట ముందో? లేదంటే ఒక రోజు ముందో? వెళ్ళి థియేటర్ దగ్గర పడిగాపులు కాచేవారు సినిమాకి టిక్కెట్ దొరకాలి మొదటి రోజు మొదటి ఆట చూడాలి అని పిచ్చి జనం అలా చేసేవారు. అందులో సగం మంది పక్కన ఉండే పల్లెటూరు వారు కూడా ఉంటారు. ఎందుకంటే ఆ రోజు పని అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చి సినిమా చూసి, ఆ సినిమా గురించి వారి ఊరంతా చెప్పేవాళ్ళు అప్పట్లో.

మరి ఇప్పుడు 2020 యుగం వచ్చింది, ఇప్పుడు థియేటర్ ముందు టిక్కెట్ కోసం పడికాపులు కాచేవాళ్ళు ఉండరు. ఎందుకంటే పల్లెటూరి వారికి కూడా తెలిసిపోయింది ఆన్లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకోవడం. ఆ ఆన్లైన్ ప్రక్రియ పేరు ‘బుక్ మై షో’. మరి ఆ బుక్ మై షో వారు ఊరికే అంతా పేరు సంపాదించుకోలేరు. ఏదో ఒక దానితో జనాలకి దగ్గర అవ్వాలి అని చెప్పి ఆ సినిమాకి ఇంత మంది జనం బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకి జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పి ఒక దిక్కుమాలిన % పెట్టేస్తున్నారు. ఇప్పుడు ‘సైరా’ సినిమాకి జనం ఆసక్తి చూపిస్తారు. కాబట్టి దానికి 80-90% వరకు ఇచ్చిన చూసేస్తారు, టిక్కెట్లు బుక్ చేసేసుకుంటారు.

- Advertisement -

సైరా అంటే పెద్ద సినిమా అందులో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాకి తక్కువ % ఇస్తే జనాలు బుక్ మై షో ని తిట్టుకుంటారు కాబట్టి ఎక్కువగానే ఇవ్వాలి. అది వారి మార్కెటింగ్ స్ట్రాటజీ లో ఒకటి. మరి చిన్న సినిమాలు బాగా ఆధారణ పొందుతున్నాయి అని ఆ సినిమా విడుదల అయిన రోజు ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ సినిమా బాలేదు అని చెప్పితే అందరూ వారి మాటను నమ్ముతారు. కారణం చిన్న సినిమా కాబట్టి డబ్బులు వృధా చేసుకోవడం జనాలకి ఇష్టం ఉండదు. ఒక చిన్న సినిమాకి ఆధారణ మొదటి రోజు నుండి తెలియదు. మెల్ల మెల్లగా ఆ సినిమా కోసం జనాలు వెళ్లాలా? వద్దా? అనేది కూడా ఇప్పుడు బుక్ మీ షో డిసైడ్ చేసేస్తుంది. కారణం బుక్ మై షో ఇస్తున్న % కి చిన్న సినిమాలకు వస్తున్న ఆధారణ వలన తెలుగు పరిశ్రమకి ఇబ్బంది వస్తుంది.

గత శుక్రవారం విడుదల అయిన సినిమా ‘రాజు గారి గది 3’. ఆ సినిమా విడుదల అయిన రోజు ఒక మోస్తరు జనాలని మాత్రమే ఆకర్షించింది. కొంతమందికి నచ్చింది అంటే కారణం సినిమాలో వారికి హాస్య సన్నివేశాలు బాగా నచ్చాయి ముఖ్యంగా చాలా రోజుల రోజుల తర్వాత ‘ఆలీ’ గారిని తెర మీద చూసుకోవడం వలన మాకు ఉపశమనం దొరికింది అని అన్నారు. కొంతమంది కి అసలు సినిమా మొత్తం నచ్చలేదు అని మొదటి ఆట నుండే నెగెటివ్ టాక్ వచ్చేలా చేశారు అందులో ‘బుక్ మై షో’ కూడా ఒకలు. ఆన్లైన్ లో సినిమాకి టిక్కెట్ ఆధారణ పెరగలేదు అనడానికి కారణం బుక్ మై షో లో ఇచ్చిన % పరంగానే జనాలు ఆ సినిమా వైపు మొగ్గు చూపలేదు. చాలా మంది జనాలు కూడా సినిమాకి తక్కువ రేటింగ్ కూడా ఇచ్చారు. జనాలు సినిమాని చూసి రేటింగ్ ఇవ్వడం వేరు. బుక్ మై షో లాంటి వాళ్ళు రేటింగ్ ఇవ్వడం వేరు.

ఇక ‘రాజు గారి గది 3’ సినిమాకి కొంతమంది నుండి అయిన అంతో ఇంతో మద్దతు లబిస్తుంది అని చెప్పి సక్సెస్ మీటింగ్ ని ఏర్పాటు చేసేసింది సినిమా యూనిట్ వాళ్ళు. ఇక ఆ మీటింగ్ లొ మాట్లాడుతూ ఆలీ, దర్శకులు ఓంకార్, హీరో అశ్విన్ బాబు ముగ్గురు ఆవేధనకి గురి అయ్యారు. వారి మాటల్లో వారు ‘బుక్ మై షో’ ని ఉద్ధేశిస్తూ ‘’నువ్వు ఎవరూ రా అసలు మా సినిమాకి రేటింగ్ ఇవ్వడానికి? సినిమా ఏమన్న ని అబ్బాదా? తోలు తీస్తా ఇంకోసారి ఇలాంటి చెత్త రేటింగ్ లు వేసి జనాలని సినిమా టిక్కెట్ బుక్ చేయకుండా చేస్తే”……అని చెప్పి ఆగ్రహం కూడా వ్యక్తపరిచారు. కొంత సమయం అయిపోయిన తర్వాత హీరో, హీరోయిన్ ఇద్దరు కొంత హాస్యం కూడా చేశారు ఆ మీటింగ్ లో.

మారిన తరం ని బట్టి సినిమాకి కొంచెం ఆధారణ వచ్చినా జనాలు ఆ సినిమాలో ఏదో ఉంది అని వెళ్లిపోతున్నారు. ఒకవేళ వారికి నచ్చితే వారే మంచి రివ్యూ ఇచ్చేస్తున్నారు. నచ్చకపోతే నచ్చలేదని ముందే చెప్పేస్తున్నారు. జనాలు కూడా కొంతమంది యూట్యూబ్ లో బాగా పాపులర్ అవ్వాలి అని చెప్పి సినిమా గురించి అడ్డ దిడ్డంగా చెపేస్తున్నారు రివ్యూ లు. మరి ఇంత గంధరగోళం మధ్య ఆ సినిమాని చూడలేని జనం మాధ్యమాల్లో విడుదల అయ్యేదాక ఎదురుచూసి ఇంటిల్లిపాది కూర్చొని వారి టీవి లోనే చూసుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All