
పటాస్ షో తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శ్రీముఖి. జులాయి మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈమె..పలు సినిమాల్లో హీరోయిన్ గా , సైడ్ క్యారెక్టర్ గా నటించింది. కానీ బిజీ నటి మాత్రం కాలేకపోయింది. ఈ తరుణంలో బుల్లితెర ఫై యాంకర్ గా అడుగుపెట్టి ప్రస్తుతం వరుస షోస్ తో రాణిస్తుంది. అలాగే వెండితెర ఛాన్సులు వచ్చిన కాదనకుండా చేస్తుంది. రీసెంట్ గా ‘క్రేజీ అంకుల్స్’, ‘మాస్ట్రో’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తుంది. ఇదిలా ఉంటె ఈ భామ కు ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనికపూర్.
తాజాగా జీ తెలుగు లో ‘సరిగమప ద సింగింగ్ సూపర్‌స్టార్’ షో మొదలైంది. ఈ షో కు శ్రీముఖి యాంకర్ గా చేస్తుంది. కాగా ఈ షో కు బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్, యువన్ శంకర్ రాజాలు గెస్టులుగా వచ్చారు. వాళ్లతో కలిసి శ్రీముఖి తెగ సందడి చేసింది. ఈ క్రమంలో ‘సార్.. హీరోయిన్‌గా ఏదైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి’ అని బోనీ కపూర్‌ని నేరుగా అడిగేసింది. దీంతో శ్రీముఖి కోరిన ఈ కోరికపై ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు బోనికపూర్. ‘సౌత్‌లో నేను హీరోగా చేస్తా. నాకు జోడీగా నిన్ను తీసుకుంటా’ అంటూ అందరిముందే మాట ఇచ్చాడు. దీంతో వెంటనే శ్రీముఖి ఆయనను హగ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
