Homeటాప్ స్టోరీస్అమెజాన్‌లోకి `బొంబాట్` కూడా వ‌చ్చేస్తోంది!‌

అమెజాన్‌లోకి `బొంబాట్` కూడా వ‌చ్చేస్తోంది!‌

అమెజాన్‌లోకి `బొంబాట్` కూడా వ‌చ్చేస్తోంది!‌
అమెజాన్‌లోకి `బొంబాట్` కూడా వ‌చ్చేస్తోంది!‌

`ఈ న‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా న‌టిస్తున్న రొమాంటిక్ రొబోటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `బొంబాట్‌`. రాఘ‌వేంద్ర‌వ‌ర్మ ద‌ర్శ‌కుడు. కె. రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచిత డ్రీమ్ వ‌ర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విశ్వాస్ హ‌న్నూర్ కార్ నిర్మిస్తున్నారు.  డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకం పై చాందిని చౌద‌రి, సిమ్రాన్ చౌద‌రి హీరోయిన్‌లుగా న‌టించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 3న స్ట్రీమింగ్ కాబోతోంది.

ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర మాట్లాడుతూ `స‌రికొత్త క‌థ‌తో డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో వ‌స్తున్న చిత్ర‌మిది. క‌థ‌, క‌థ‌నాల‌పై వున్న న‌మ్మ‌కంతో నిర్మాత విశ్వాస్ హ‌న్నూర్ కార్ అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టే స్థాయిలో ఈ మూవీ స‌క్సెస్ సాధిస్తుంద‌న్న న‌మ్మ‌క‌ముంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావుగారు ఈ మూవీ స్క్రిప్ట్ ద‌శ నుంచి మాతో ట్రావెల్ చేస్తున్నారు. సినిమా చూసిన ఆయ‌న ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ప్ర‌శంసించారు. రోబోటిక్ క‌థ క‌థ‌నాల‌తో చాలా కొత్త పంథాలో రూపొందిన చిత్ర‌మిది. ఈ చిత్రాన్ని కేవ‌లం 38 రోజుల్లో హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో పూర్తి చేశాం` అన్నారు.

- Advertisement -

కొత్త త‌ర‌హా చిత్రాలకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థంప‌డుతున్నారు. ఆ కోవ‌లో ఈ చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌క‌ముంది. ‌మ‌క‌రంద్ దేశ్ పాండే పాత్ర చిత్రణ‌, జోష్‌బి సంగీతం, ప్రియ‌ద‌ర్శి పంచ్ డైలాగ్‌లు సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. రాఘ‌వేంద్ర‌రావు స‌ల‌హాలు, సూచ‌న‌లు మా సినిమాకు చాలా ఉప‌యోగ‌ప‌డ్డాయి. కొత్త త‌ర‌హా క‌థా, క‌థ‌నాల‌తో రూపొందిన `బొంబాట్‌` ఖ‌చ్చితంగా కొత్త ద‌నాన్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌క‌ముంది. డిసెంబ‌ర‌న్ 3న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది` అని నిర్మాత విశ్వాస్ హ‌న్నూర్ కార్ తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All