
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ..గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించడమే కాదు మూడు రోజుల్లోనే రూ. 500 కోట్లు వసూళ్లు చేసి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ఈ విజయాన్ని బాలీవుడ్ తట్టుకోలేకపోతుంది. గత కొన్ని నెలలుగా మన తెలుగు సినిమాలు సత్తా చాటుతూ..బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కు నెట్టివేస్తున్నాయి. దీంతో బాలీవుడ్లో తెలుగు సినిమా అంటే భయం తో పాటు ఈర్ష కూడా పెరిగిపోతుంది. అందుకే ఆర్ఆర్ఆర్ విడుదలైన మూడు రోజులకు గాని దాని గురించి నోరు విప్పడం లేదు. ఇప్పుడిప్పుడే బయటకు వాస్తు ఆర్ఆర్ఆర్ ఫై ప్రసంశలు కురిపిస్తున్నారు. హీరో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ , వివేక్ ఒబేరాయ్ , దర్శక నిర్మాత కరణ్ జోహార్ వంటి వారు ట్వీట్స్ చేసి మెచ్చుకున్నారు.
ఇక నార్త్ లో ఆర్ఆర్ఆర్ రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ పోతుంది. ఫస్ట్ డే 19 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా.. తర్వాతి రోజు పుంజుకొని రూ.24 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలో ఆదివారం రూ. 31.50 కోట్ల మేర కలెక్ట్ చేసి సంచలనం రేపింది. ఇక కీలకమైన సోమవారం నాడు 17 కోట్లు వసూలు చేసి మొత్తంగా హిందీలో నాలుగు రోజుల్లో రూ. 91.50 కోట్లు అందుకుంది. ఈ కలెక్షన్లు చూసి బాలీవుడ్ స్టార్స్ కు మాటలు రావడం లేదు. అందుకే ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు.