
ఒక్క రోజు తేడాతో బాలీవుడ్‌కు మరో చేదు వార్త. ఉధవారం విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే ఒక్క రోజు తిరక్కుండానే మరో నటుడు రిషికపూర్ (67) కన్నుమూశారు. క్యాన్సర్‌తో గత కొంత కాలంగా పోరాడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబైలోని ఎన్‌హెచ్ రిలయన్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
బుధవారం రాత్రి రిషికపూర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోని ఎన్‌హెచ్ రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాస కోస సంబంధిత సమస్య్తో బాధపడుతున్న ఆయనని ఆసుపత్రిలో చేర్చామని ఆయన సోదరుడు రణ్‌ధీర్‌కపూర్ తెలిపారు.
క్యాన్సర్ వ్యాధి కారణంగా బాధపడుతున్న రిషికపూర్ గత ఏడాది సెప్టెంబర్ చికిత్స చేయించుకుని ఇండియా తిరిగి వచ్చారు. ఆ తరువాత వైరల్ ఫీవర్, ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యతో ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరారు. రెండు సార్లు చికిత్స పొందారు.