Homeటాప్ స్టోరీస్షాకింగ్ : `బ్లాక్ పాంథ‌ర్` స్టార్ మృతి ‌!

షాకింగ్ : `బ్లాక్ పాంథ‌ర్` స్టార్ మృతి ‌!

block panther fame chadwick boseman is no more
block panther fame chadwick boseman is no more

హాలీవుడ్ చిత్రం `బ్లాక్ పాంథ‌ర్‌`. మార్వెల్ సిరీస్‌లో వ‌చ్చిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో  న‌టించిన స్టార్ చాడ్విక్ బోస్మాన్ మృతి చెందారు. గ‌త నాలుగేళ్లుగా ప్రేగు క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న తుది శ్వాస విడిచార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు అధికారికంగా వెల్ల‌డించారు. 2016 నుంచి చాడ్విక్ బోస్మాన్ స్టేజ్ త్రీ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతున్నారు.

బోస్మాన్ నిజ‌మైన పోరాట యోధుడ‌ని, ప‌ట్టుద‌ల‌తో మీరు ప్రేమించిన చిత్రాల‌ని మీ ముందుకు తీసుకొచ్చాడ‌ని, ఆయ‌న త‌న నివాసంలోనే క‌న్ను మూశాడ‌ని చిడ్విక్ కుటుంబ స‌భ్యులు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ద‌క్షిణ క‌రోనాలినాలో పుట్టి పెరిగిన బోస్మాన్ 2013లో లెజెండ‌రీ బేస్ బాల్ ఆట‌గాడు రాబిన్స‌న్ క‌థ‌తో వ‌చ్చిన స్పోర్ట్స్ డ్రామా `43`తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2016లో వ‌చ్చిన కెప్టెన్ అమెరికా సివిల్ వార్‌లో మార్వెల్ సూప‌ర్ హీరో బ్లాక్ పాంథర్ గా న‌టించాడు.

- Advertisement -

బోస్మాన్ హీరోగా 2018లో వ‌చ్చిన `బ్లాక్ పాంథ‌ర్‌` ప్ర‌పంచ వ్యాప్తంగా 1.3 మిలియ‌న్డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఆ త‌రువాత వ‌చ్చిన అవెంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్‌, అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ చిత్రాల్లో బ్లాక్ పాంథ‌ర్ పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన `డా 5 బ్ల‌డ్స్‌`లోచాడ్విక్ చివ‌రి సారి న‌టించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All