Homeటాప్ స్టోరీస్ఈ పాంథర్ సీన్ల వల్ల ఎవరికి ఉపయోగం?

ఈ పాంథర్ సీన్ల వల్ల ఎవరికి ఉపయోగం?

ఈ పాంథర్ సీన్ల వల్ల ఎవరికి ఉపయోగం?
ఈ పాంథర్ సీన్ల వల్ల ఎవరికి ఉపయోగం?

తెలుగు సినిమా ఇప్పుడు చాలా ఎదిగిపోయింది. మనం బాలీవుడ్ వైపు చూడటం మానేసి, వాళ్ళే మన సినిమాల మీద కన్నేసే పరిస్థితికి చేరుకున్నాం. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్ తీయాలంటే తెలుగు వాళ్ళు అనేంతగా ముద్ర పడిపోయింది. సాహో, సైరా వంటి చిత్రాల తర్వాత తెలుగు సినిమాకి మరింత గౌరవం పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే మనం ఎంత భారీ సినిమాలు తీస్తున్నా, అందులో అనవసర సన్నివేశాలను మాత్రం అవాయిడ్ చేయలేకపోతున్నాం. వాటి వల్ల బడ్జెట్ పెరుగుతుంది తప్ప వాటి వల్ల ఉపయోగమేంటో మాత్రం అర్ధం కాదు. ఉదాహరణకు సాహోలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ తీసుకుంటే అందులో ఒక ఇరుకు అపార్ట్మెంట్ వంటి దాంట్లో ఫైట్. సడెన్ గా ఒక రూమ్ లో ప్రభాస్ వెళితే అక్కడ ఒక పెద్ద బ్లాక్ పాంథర్ ను కట్టేసి ఉంచుతారు. దీని వెనకాల లాజిక్ కు దర్శకుడే రీజనింగ్ ఇవ్వాలి.

- Advertisement -

సరిగ్గా ఇలాంటి సన్నివేశమే సైరా చిత్రంలో కూడా ఉంది. బ్రిటీషు వాళ్ళు ఒక బ్లాక్ పాంథర్ ను ఇండియాకు షిప్ లో పంపిస్తారు. ఇక్కడ కూడా లాజిక్ కు అందని సన్నివేశమే ఉంది. సినిమా అంతా పక్కాగా తీసి ఇటువంటి సీన్లను ఎందుకు పెడతారో ఏంటో అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే బ్లాక్ పాంథర్ మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All