Homeటాప్ స్టోరీస్కర్ణాటక ఎన్నికల్లో కమలం హవా

కర్ణాటక ఎన్నికల్లో కమలం హవా

bjp towards magic figure in karnataka assembly electionsకర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కమలం వికసించింది . అసలు కర్ణాటకలో హాంగ్ అసెంబ్లీ వస్తుందని , ఏ పార్టీ కి ఆధిక్యత లభించదని సర్వేలలో తేల్చారు కట్ చేస్తే కన్నడిగులు అనూహ్య ఫలితాలను ఇచ్చారు . కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతుండగా ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తోంది . యడ్యూరప్ప తో పాటుగా గాలి జనార్దన్ రెడ్డి పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కన్నడ ప్రజలు మాత్రం బిజెపి నే గెలిపించారు .

కన్నడ నాట బిజెపి అధికారంలోకి వస్తుండటంతో చంద్రబాబు కు మింగుడు పడటం లేదు ఎందుకంటే ఎన్నికల ముందే చంద్రబాబు భాజపా తో విభేదించాడు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని అందుకే కర్ణాటకలో ఆ పార్టీ ని ఓడించాలని పిలుపు ఇవ్వడమే కాకుండా తెరవెనుక పెద్ద ప్రయత్నాలే చేసాడు చంద్రబాబు కానీ బాబు ఊహించినట్లుగా కాకుండా విభిన్న ఫలితాలు రావడంతో చంద్రబాబు ఖంగుతిన్నాడు . ఇక జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని అనుకుంటే రెంటికి చెడిన రేవడిలా తయారయ్యింది దాని పరిస్థితి . హంగ్ అనుకుంటే భారతీయ జనతా పార్టీ కి పూర్తిస్థాయి మెజారిటీ వచ్చేలా ఉండటంతో కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ పార్టీలకు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All