Homeటాప్ స్టోరీస్పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా భారత్ లో కలిపేస్తారట !

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా భారత్ లో కలిపేస్తారట !

bjp party subramanian
bjp party subramanian

పేరుకి భారతదేశం పటంలో పైభాగాన ఉన్న జమ్మూ కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది , అలాగే భారత్ కు తల లాగా కనిపిస్తుంది…… నిండుగా ఉంటుంది కానీ వాస్తవానికి భారత్ చిత్రపటంలో ఉన్నట్లుగా భూభాగం భారత్ పరిధిలో కానీ జమ్మూ కాశ్మీర్ పరిధిలో కానీ లేదు . కొంతభాగం పాకిస్థాన్ లో ఉండగా కొంతభాగం మాత్రం చైనా ఆక్రమణలో ఉంది . దాంతో ఆ భాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తున్నారు . అయితే పాక్ అధీనంలో ఉన్న భూభాగాన్ని కూడా భారత్ లో కలిపేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసాడు భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్యం .

నిజంగానే భారతీయ జనతా పార్టీ ఆలోచనలు అలాగే ఉన్నాయట ! అఖండ భారతం భాజపా స్వప్నం . భారతీయ జనతా పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన నరేంద్ర మోడీఅమిత్ షా లు గురువు అద్వానీ ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నారు . దాంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని సైతం భారత్ లో కలపాలని భావిస్తున్నారట . అంతేనా రామమందిర నిర్మాణం గురించి కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారట . కేంద్రంలో కావాల్సినంత మెజారిటీ ఉండటంతో ధైర్యంగా ఈ అడుగులు వేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All