HomePolitical Newsగల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ జెండా ఎగురవేయించిన ఘనత బీజేపీదే

గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ జెండా ఎగురవేయించిన ఘనత బీజేపీదే

గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ జెండా ఎగురవేయించిన ఘనత బీజేపీదే
గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ జెండా ఎగురవేయించిన ఘనత బీజేపీదే

కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈటలను అసెంబ్లీలో చూడటం ఇష్టంలేకపోతే అసెంబ్లీకి రావొద్దని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పొచ్చంటూ సెటైర్లు వేశారు. వాళ్లు మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడతారని.. మేము ఏమి మాట్లాడినా బూతు అంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదిమందికి ఆదర్శంగా ఉండాలన్నారు కిషన్‌రెడ్డి. అంతేకాదు.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనదినంగా నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైందని అన్నారు.

అదే రోజు నుంచి తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు చేపట్టేందుకు అటు టీఆర్ఎస్ కూడా ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. ఇక ప్రధాని మోదీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. దేశంలో కుటుంబ పాలన తేవాలని..కుటుంబ పార్టీలన్నింటిని కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రజాస్వామ్య పాలన చేయడమే తెలుసని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. ఎప్పటికీ ఎన్డీఏకు కేసీఆర్ ప్రత్యామ్నాయం కానే కారని స్పష్టం చేశారు.

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ జెండా ఎగురవేయించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ది అతి పెద్ద అవినీతి కుటుంబమని..మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే..అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. తమకు ప్రజాస్వామ్య పాలన చేయడమే తెలుసని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. ఎప్పటికీ ఎన్డీఏకు కేసీఆర్ ప్రత్యామ్నాయం కానే కారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు లేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాన్‌కో, జెన్‌కోకు రూ.40 వేల కోట్ల అప్పు ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All