Homeటాప్ స్టోరీస్శుక్రవారం 3 సినిమాలు విడుదల మన తెలుగు సినిమా నెగ్గుకొస్తుందా?

శుక్రవారం 3 సినిమాలు విడుదల మన తెలుగు సినిమా నెగ్గుకొస్తుందా?

శుక్రవారం 3 సినిమాలు విడుదల మన తెలుగు సినిమా నెగ్గుకొస్తుందా?
శుక్రవారం 3 సినిమాలు విడుదల మన తెలుగు సినిమా నెగ్గుకొస్తుందా?

‘విజిల్’, ‘ఖైదీ’, ‘తుపాకీ రాముడు‘ లాంటి మూడు సినిమాలు ఈ శుక్రవారం థియేటర్ లోకి రాబోతున్నాయి. తమిళ తలైవాలు అయిన ఇళయ దళపతి విజయ్, కార్తీ గారి సినిమాల మద్యలో మన ‘బిత్తిరి సత్తి’ నెగ్గుకొస్తాడా? అంటే ఆ విషయం కొంచెం సందేహం గానే ఉంది అని అనుకుంటున్నారు సినిమా ప్రముఖులు. తుపాకీ రాముడు ట్రైలర్ చూసిన జనాలు కూడా మన బిత్తిరి సత్తిని మెచ్చుకుంటున్నారు కానీ తుపాకీ రాముడు సినిమాతో బిత్తిరి సత్తి మరియు చిత్ర నిర్మాత ఇద్దరు పెద్ద సాహసమే చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోయారు.

ఇళయ దళపతి విజయ్ – అట్లీ దర్శకత్వంలో రాబోతున్న మూడవ సినిమా ‘విజిల్’. ‘పోలీసోడు’, ‘అదిరింది’ వంటి సినిమాలు తెలుగు, తమిళంలో బాగా విజయ ఢంకా మోగించాయి. అదిరింది సినిమా మొదట విమర్శకుల పాలు అయినప్పటికీ చివరికి వారు కూడా సినిమాకి మద్థతు తెలిపారు. ఇక మొదటి సినిమా ‘రాజా రాణి’ తో తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నారు దర్శకులు అట్లీ. మొదటి సినిమాలో కథా నాయికగా నటించిన ‘నయనతార’ ని ఈ విజిల్ సినిమాకి కథా నాయికగా తీసుకున్నారు. విజిల్ సినిమాకి ‘ఏ.ఆర్. రెహమాన్’ గారు సంగీతాన్ని అందించారు.

- Advertisement -

‘ఖైదీ’ సినిమా విషయానికి వస్తే లోకేష్ కనకరాజ్ – కార్తీ కలయికలో వస్తున్న మొదటి సినిమా. ఈ ఏడాది ప్రారంభంలో ‘దేవ్’ సినిమాతో వచ్చి నిరాశ పరిచాడు కార్తీ. గత సంవత్సరం కూడా ‘చినబాబు’ పేరుతో ఒక సినిమా చేసాడు ఆ సినిమా కూడా ఎక్కువ మందికి నచ్చలేదు, కనుక ఇప్పుడు కార్తీకి మన తెలుగులో ఒక సాలిడ్ హిట్ కావలి. అందుకే లోకేష్ కనకరాజ్ తో చేతులు కలిపారు. లోకేష్ కనకరాజ్ గత సినిమా చూసుకుంటే ‘నగరం’ అని సందీప్ కిషన్ తో చేసారు. ఆ సినిమా తెలుగు – తమిళంలో  విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందువలన లోకేష్ కనకరాజ్ – కార్తీ కలయికలో వస్తున్న ‘ఖైదీ’ సినిమా మీద విజిల్ సినిమాకంటే ఎక్కువ ఆసక్తి ఉంది జనాలకి.

ఇక మన బిత్తిరి సత్తి మొదటి సారి హీరోగా నటిస్తున్న సినిమా ‘తుపాకీ రాముడు’. టి.ప్రభాకర్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.ఏ ‘రసమయి బాలకిషన్’ గారు రసమయి ఫిలిమ్స్ పేరు మీద నిర్మిస్తున్నారు. తుపాకీ రాముడు సినిమా ట్రైలర్ ని ‘విజయ్ సాయి దేవరకొండ’ గారు విడుదల చేసారు. ఆ ట్రైలర్ చూసిన జనాలకి అసలు కొంచెం కూడా నమ్మకం లేదు ఆ సినిమా విజయవంతం అవుతుంది అని. మంచిగా బులితెర మీద మంచి పేరు సంపాదించుకున్న బిత్తిరి సత్తి ఈ సినిమాతో అనవసరంగా తన పరువు ని తానే దిగ జార్చుకుంటాడు అని మన తెలుగు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తుపాకీ రాముడు సినిమా ట్రైలర్ చూస్తే మనకి పాత సినిమాలు అనగా ‘ఆలీ’ నటించిన ‘పిట్టల దొర’ మరియు సంగీత దర్శకులు ‘వందేమాతరం శ్రీనివాస్’ గారు నటించిన ‘అమ్ములు’ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ఏ మాత్రం కొత్తదనం లేకుండా నిర్మాత రసమయి కిషన్ గారు మంచి రెండు పెద్ద సినిమాల మద్య శుక్రవారం తుపాకీ రాముడు సినిమాని  విడుదల చెయ్యడం అంటే పెద్ద సాహసమే అంటున్నారు. మరి చూద్దాం తమిళ సినిమాలే రెండు వాటికి అవి పోటీ పడి విడుదల అవుతుంటే వారి మద్యలో పోతున్న మన బిత్తిరి సత్తికి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All