Homeటాప్ స్టోరీస్బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ట్రైలర్ విడుదల

బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ట్రైలర్ విడుదల

bilalpur police station trailer release,ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగసాయి మాకం తెరకెక్కించారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ…వాస్తవ కథలతో సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు నిర్మించాలంటే ధైర్యం ఉండాలి. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంతో నిర్మాత మహంకాళి శ్రీనివాస్ అలాంటి సాహసం చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా రేపు థియేటర్ లలో ప్రేక్షకులను నిరాశపరచదు అని ఖచ్చితంగా చెప్పగలను. తెలంగాణ పల్లెల్లో ఉండే వాతావరణం ఈ చిత్రంలో కనిపిస్తుంది. అన్నారు.

- Advertisement -

నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ…సినిమా కథలు మన జీవితాల్లో నుంచే పుడతాయి. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ కథ మన చుట్టూ ఉన్న ప్రజలను దగ్గర నుంచి చూసిన స్ఫూర్తితో రాసుకున్నాను. దర్శకుడు నాగసాయి నేనిచ్చిన కథను అంతే చక్కగా రూపొందించారు. ఈ కథను వాణిజ్య హంగులు ఉంటూనే సహజత్వం ఉండేలా నిర్మించాం. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు.

దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ….మా సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ వాళ్ల ఊరు, ఆ ఊరిలో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. ఈ కథను ఎక్కడో కాల్పనికంగా తీసుకొచ్చింది కాదు. అన్నీ మనం చూసిన సందర్భాలే ఉంటాయి. కమర్షియల్ అంశాల కోసం కథకు దూరంగా వెళ్లి సినిమాను రూపొందించలేదు. ఒక ఊరిలోని పోలీస్ స్టేషన్ కు ఎలాంటి వింత వింత కేసులు వస్తాయన్నది ఈ చిత్ర కథాంశం. అందులో వినోదాత్మకంగా సాగే అంశాలతో పాటు ఇప్పుడు సమాజంలో జరుగుతున్నకొన్ని చేదు ఘటనలు కూడా ఉంటాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. అన్నారు.

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ – జీబూ, డీటీఎస్ – రాజశేఖర్, పాటలు – గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనిశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All