Homeటాప్ స్టోరీస్బిగిల్.. ఇదేం వివాదం గురూ

బిగిల్.. ఇదేం వివాదం గురూ

Bigil
బిగిల్.. ఇదేం వివాదం గురూ

ఈ మధ్య సినిమాలు తీసేవారికి ఏం తీయాలన్నా కూడా భయమేసేలా ఉంది పరిస్థితి. ఏం తీస్తే ఎవరి మనోభావాలు హర్ట్ అవుతాయో అని భయపడుతున్నారు. కొన్ని చోట్ల నిజాయితీగా ఉన్నా, కొన్ని చోట్ల మాత్రం అనవసరమైన వాటికి వివాదాలు చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన వాల్మీకి టైటిల్ వివాదం మర్చిపోక ముందే తమిళ టాప్ హీరో విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి ఇప్పుడు ఒక వివాదం రాజుకుంది.

అది వింటే ఎంత కామెడీగా ఉందంటే ఇలాంటి వాటికి కూడా మనోభావాలు హర్ట్ అవుతాయా అనిపిస్తోంది. రీసెంట్ గా బిగిల్ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేసారు. అందులో విజయ్ మటన్ కొట్టే చెక్కపై కాలు పెట్టి ఉంటాడు, పక్కనే మటన్ కొట్టే కత్తి కూడా ఉంది. ఇంతకీ ఇందులో వివాదం ఏంటి అనుకుంటున్నారా? మటన్ కొట్టే చెక్కపై కాలు పెట్టడం చాలా తప్పట.

- Advertisement -

మాంసాన్ని విక్రయించే వారు రోజూ మొదట ఆ చెక్కను పూజించి అప్పుడు విక్రయాలు మొదలుపెడతారట. ఇప్పుడు విజయ్ దానిపై కాలు పెట్టడంతో వారి మనోభావాలు హర్ట్ అయ్యాయట. దీనికి అన్నాడీఎంకే పార్టీ కూడా సపోర్ట్ చేస్తోంది. అన్నాడీఎంకే పార్టీ ఎప్పుడూ విజయ్ సినిమాకు ఎలా ఇబ్బందులు సృష్టించాలా అని చూస్తూ ఉంటుంది. మటన్ కొట్టే చెక్క ద్వారా సరికొత్త వివాదం వారికి దొరికిందన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All