Homeగాసిప్స్డబ్బుకి కి కాదు మనిషికి ఉండాలి అభిమానులు...

డబ్బుకి కి కాదు మనిషికి ఉండాలి అభిమానులు…

Bigg Boss Telugu 3
డబ్బుకి కి కాదు మనిషికి ఉండాలి అభిమానులు…

బిగ్ బాస్ ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసిన దాని గురించే టాపిక్, ఎందుకంటే అంతలా దాని మీద పాపులారిటీ వచ్చింది కాబట్టి, ప్రతి ఒక్కరికి దాని మీద రోజు రోజు కి ఏదో ఒక టాపిక్ బయటికి వస్తుంది దాని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నేను చెప్పేది మాత్రం అక్షరాలా సత్యం.కావాలంటే మీరే చూడొచ్చు.

గత సంవత్సరం తెలుగు బిగ్ బాస్ సీజన్లో కౌశల్ ఆర్మీ చేసింది రచ్చ అని అందరికి తెలుసు, కానీ ఎప్పుడైతే జనాలు కౌశల్ గెలిచి సాధించుకున్నాడు అని అన్నవాళ్ళు ఎంత మంది ఉన్నారో, అంతే మంది అతను ఫేక్ అకౌంట్స్ తయారు చేసుకొని గెలిచాడు అని అన్నారు, అసలు దాంట్లో సందేహించవలిసిన అవసరం లేదు, ఎందుకంటే కౌశల్ తన ఆటను తాను ఆడాడు గెలిచాడు.

- Advertisement -

ఇప్పుడు 3 వ సీజన్లో ఫేక్ అకౌంట్స్ అన్నది నిజమే అనిపిస్తుంది, చూసుకుంటే “హిమజ” కి అసలైన, నిజమైన అభిమానులు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో 48,000మంది మాత్రమే ఉంటే, తను ఈ వారం బయటికి వెళ్ళే వారిలో ఉందని తెలిసీ కొంతమంది ఆమెకి మద్దతుగా డూప్లికేట్ అకౌంట్స్ తయారు చేసారు. అవి డూప్లికేట్ అని జనాలకి ఎలా తెలిసాయి అంటే, హిమజకి, హిమజ డూప్లికేట్ అకౌంట్స్ కి 48,000 – 1,25,000 అంత తేడా ఉండటం చూసి జనాలు అర్ధం చేసుకున్నారు.

నిజంగా అది నిజమే అయితే మేము డబ్బులు చూసి కాదు, మనిషి విలువ తెలుసుకొని ఓట్లు వేస్తాం అని జనాలు అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All