Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి..?

బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి..?

BiggBoss 5 Who will Eliminate this week
 

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో ఇప్పటికే మూడు ఎలిమినేషన్స్.. ముగ్గురు హౌజ్ మెట్స్ బయటకు వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది హౌజ్ మెట్స్ ఉన్నారు. అయితే ఈ ఎనిమిది మందిలో ఎవరు ఈ వారం హౌజ్ నుండి బయటకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో రవి, కాజల్, సన్నీ, లోబో, నటరాజ్, సిరి, అనీ, ప్రియ ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో ఐదుగురు హౌజ్ మెట్స్ ఈజీగా సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.

హౌజ్ లో వారి ఆట తీరు.. బయట వారికి ఉన్న క్రేజ్.. ఇలా అన్ని కాలిక్యులేట్ చేసుకుంటే.. రవి, ప్రియ, సిరి, సన్నీ, కాజల్.. ఈ ఐదుగురు ఈ వారం తప్పకుండా సేవ్ అవుతారని తెలుస్తుంది. ఇక మిగిలిన ముగ్గురు అనగా లోబో, అనీ, నటరాజ్.. వీరిలో ఒకరు హౌజ్ నుండి వెళ్లిపోతారని ఓటింగ్ ఎనాలసిస్ టాక్. హౌజ్ లో లోబో ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాని అడపాదడపా అతను రియాక్ట్ అయ్యే విధానంపై హౌజ్ మెట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ వారం నామినేషన్స్ టైం లో కూడా ప్రియ మీద అరవడం కొద్దిగా అతి అయ్యిందని చెప్పొచ్చు. మరి ఆ ఒక్క కారణంతో లోబోని ఆడియెన్స్ బయటకు పంపిస్తారా అన్నది చూడాలి.

- Advertisement -

ఇక అనీ మాస్టర్ తన వరకు ఆట బాగానే ఆడుతున్నా నామినేషన్స్.. టాస్క్ ఇలా ప్రతి విషయంలో ఆమె ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆమెకు ఎలిమినేషన్ కత్తి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. లాస్ట్ గా నటరాజ్ మాస్టర్.. ఏదో చేయాలి.. ఎంతో చేయాలి అన్న నటరాజ్ మాస్టర్ ఉత్సాహం బాగున్నా.. ఆయనకి ఒకరు ఏదైనా చెబితే దాని మీద ఆర్గ్యుమెంట్స్ చేసి రచ్చ చేస్తాడు. ఇక నామినేషన్స్ లో ఆయన చెప్పిన పులితో వేట.. నాతో ఆట డేంజర్ లాంటి డైలాగ్స్ చెప్పడానికి ఆయనకు బాగున్నా.. ఆడియెన్స్ మాత్రం ఆయన్ను జోకర్ అనుకుంటున్నారు. ఈసారి హౌజ్ నుండి వచ్చే వారిలో నటరాజ్ మాస్టర్ కే ఎక్కువ స్కోప్ ఉందని టాక్. మరి ఈ వారం ఎవరు హౌజ్ నుండి బయటకు వస్తారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All