Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5 : ఎడిటర్ కు టైటిల్ ఇవ్వాలంటున్న ఆడియెన్స్..!

బిగ్ బాస్ 5 : ఎడిటర్ కు టైటిల్ ఇవ్వాలంటున్న ఆడియెన్స్..!

BiggBoss 5 Telugu Title Winner Audience Choice Revealed

బిగ్ బాస్ సీజన్ 5 లో ఎవరు బాగా ఆడుతున్నారు..? బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు..? ఇలాంటి ఆసక్తికరమైన పోల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే నాలుగు వారాలు.. అంటే 3 ఎలిమినేషన్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాలుగవ వారం నడుస్తుంది. ఈ టైం లో బిగ్ బాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన ట్రోల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ ఈసారి ఎవరికి వస్తుంది అంటే.. హౌజ్ మెట్స్ కన్నా బిగ్ బాస్ 5 ఎడిటర్ కు ఇవ్వాలని ఆడియెన్స్ కోరుతున్నారు.

- Advertisement -

ఆడియెన్స్ అలా కోరడంలో తప్పేమిలేదు. ప్రతి ఎపిసోడ్ కు ప్రోమో కట్ చేస్తూ.. ఈరోజు ఎపిసోడ్ లో ఏదో ఉంది అన్నట్టు ఎడిటర్ బిల్డప్ ఇస్తున్నాడు. ప్రోమో చూసి మోసపోయి ఎపిసోడ్ చూసిన ఆడియెన్స్.. టీజర్ అదరగొట్టి తీరా సినిమా చూస్తే అట్టర్ ఫ్లాప్ అన్నట్టుగా ఉంది వారి పరిస్థితి. ప్రోమోని ఒక రేంజ్ లో కట్ చేస్తూ.. హౌజ్ లో కంటెస్టంట్స్ మధ్య అల్లకల్లోలం అన్నట్టు చూపించి తీరా ఎపిసోడ్ లో అదంతా ఏమి లేకుండా కూల్ గానే కానిస్తున్నారు.

ప్రోమోల వల్ల ఎపిసోడ్ కు భారీ హైప్ వస్తుందని చెప్పొచ్చు. బిగ్ బాస్ గురించి ఏంటా షోని చూసేది తొక్క అనే ఆడియెన్స్ ఉన్నా.. బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ఇంకా స్టార్ మా యూట్యూబ్ ఛానెల్ లో పెట్టలేదే అని ఎదురుచూసే ఆడియెన్స్ కూడా ఉన్నారు. అందుకే బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ గా ఎడిటర్ కు ఇచ్చేయాలని ఆడియెన్స్ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All