Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5 : నామినేషన్స్ లో ఆ ఆరుగురు..!

బిగ్ బాస్ 5 : నామినేషన్స్ లో ఆ ఆరుగురు..!

BiggBoss 5 Six Contestants were in 8th Week Nominations
 

బిగ్ బాస్ సీజన్ 5లో 8వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఈ సోమవారం ఎపిసోడ్ లో జరిగింది. ఎప్పటిలా గొడవలతో.. నువ్వా నేనా అనేలా నామినేషన్స్ జరపకుండా ఇంటి నుండి వచ్చిన లెటర్స్ ను సాక్రిఫైజ్ చేస్తూ నామినేషన్స్ లో నిలబడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మండే ఎపిసోడ్ మొత్తం చాలా ఎమోషనల్ గా సాగింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో శ్రీరాం చంద్ర, షణ్ముఖ్, సిరి, రవి, లోబో, మానస్ ఉన్నారు. మిగిలిన వారిలో సన్నీ కెప్టెన్ అవడంతో అతనికి డైరెక్ట్ గా బిగ్ బాస్ లెటర్ పంపించారు.

8వ వారం నామినేషన్స్ లో ఉన్న వారిని చూస్తే దాదాపు అందరు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఉన్నారు. అయితే ఉన్న వారిలో లోబో, సిరి మాత్రమే కొద్దిగా వెనక ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ వారం లోబో నెగ్గుకు రావడం కొద్దిగా కష్టమని చెప్పొచ్చు. ఈ వారం అతని పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఈ వీక్ సర్వైవ్ అవగలడు. లేదంటే ఈ వీకెండ్ లో ఇంటికి వచ్చేస్తాడు. ఇక లోబో తర్వాత సిరికి ఎలిమినేషన్ ఎఫెక్ట్ పడేలా ఉంది. ఆమె కూడా ఈ వారం రిస్క్ జోన్ లో ఉన్నట్టే అని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All