Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5 : ప్రియ ఎలిమినేషన్ తో ప్రూవ్ అయిన సన్నీ స్టామినా..!

బిగ్ బాస్ 5 : ప్రియ ఎలిమినేషన్ తో ప్రూవ్ అయిన సన్నీ స్టామినా..!

BiggBoss 5 Priya Eliminated Sunny Stamina Proves
 

50 రోజులు పూర్తయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 5లో ఎవరు టాప్ కంటెస్టంట్స్ లో నిలుస్తారు అన్నది తెలిసిపోతుంది. టాస్కులతో పాటుగా ఎంటర్టైన్ చేసే హౌజ్ మెట్స్ కొందరైతే.. కేవలం టాస్కులు ఆడే కంటెస్టంట్స్ కొందరు. కొందరు అవి ఇవి రెండు చేయడం చేతకాక జస్ట్ హౌజ్ లో తమ డ్యూటీని మాత్రమే చేస్తున్న వారు ఉన్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం హౌజ్ లో ఉన్న 13 మంది కంటెస్టంట్స్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా సత్తా చాటుతున్నాడు వీజే సన్నీ.

మొదట్లో అతనొక కమెడియన్ గా అనిపించినా ప్రియ గొడవతో హీరోగా మారాడు. ఇంకా చెప్పాలంటే ప్రియనే అతన్ని హీరోని చేసిందని చెప్పాలి. ప్రియ వర్సెస్ సన్నీ గొడవలో తప్పెవరిది అన్నది పక్కన పెడితే ప్రియ అన్న మాటలకు సన్నీ చాలా కంట్రోల్ గా ఉంటూ బయట ఆడియెన్స్ మనసులు గెలిచాడు. అందుకే ఆడియెన్స్ కూడా సన్నీ వైపు ఉండి ప్రియని బయటకు పంపించేశారు.

- Advertisement -

ప్రియ ఎలిమినేట్ అవడంలో సన్నీ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ పాత్ర ఉందని చెప్పొచ్చు. ప్రియ బయటకు రావడం కోసం అన్నీ, లోబోలకు ఎక్కువ ఓటింగ్ వేసినట్టు తెలుస్తుంది. అందుకే అనీ, ప్రియని చివరి వరకు ఉంచి వారిద్దరిలో ప్రియని ఎలిమినేట్ చేశారు. వీజే సన్నీగా హౌజ్ లోకి వచ్చి బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెలిచాడు సన్నీ. అందుకే అతనికి సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోవర్స్ ఉన్న షణ్ముఖ్ ని కూడా బీట్ చేస్తూ ఓటింగ్ తెచ్చుకుంటున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All