Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5 : నటరాజ్ మాస్టర్ కు ఎంత ఇచ్చారు..?

బిగ్ బాస్ 5 : నటరాజ్ మాస్టర్ కు ఎంత ఇచ్చారు..?

BiggBoss 5 Nataraj Master Remuneration Details
 

బిగ్ బాస్ సీజన్ 5 నుండి లాస్ట్ వీక్ నటరాజ్ మాస్టర్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యారు. హౌజ్ లో ఇంకొన్నాళ్లు ఉండే అవకాశం ఉన్నా సరే ఆడియెన్స్ ఆయన్ను బయటకు పంపించారు. ఈ క్రమంలో నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ తో ఎంత సంపాదించారు అన్న దాని మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. నటరాజ్ మాస్టర్ కు ఒకప్పుడు స్టేజ్ షోస్ తో బాగా పేరు వచ్చింది. ఈమధ్య ఆయన కొద్దిగా వెనకపడ్డారు.

నటరాజ్ మాస్టర్ కు రోజుకి 15 వేల దాకా డీల్ కుదిరిందని తెలుస్తుంది. అంటే నాలుగు వారాలకు నటరాజ్ మాస్టర్ దాదాపు నాలుగు లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు కాని తన వైఫ్ ప్రగ్నెన్సీతో ఉన్నా.. డెలివరీ టైం లో తను ఆమె వద్ద ఉండనేమో అన్న ఆవేదనలో హౌజ్ లో ఉన్న నటరాజ్ మాస్టర్ ఎట్టకేలకు తన వైఫ్ డెలివరీ టైం లో ఆమె దగ్గర ఉండే అవకాశం లభించిందని చెప్పొచ్చు.

- Advertisement -

హౌజ్ లో ఇంకొన్నాళ్లు నటరాజ్ మాస్టర్ ఉండే అవకాశం ఉన్నా ఆయన సినిమా డైలాగులు.. నామినేషన్స్ టైం లో ఆయన చేస్తున్న ఓవరాక్షన్ ఆడియెన్స్ దృష్టిలో నెగటివ్ మార్కులు పడ్డాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All