Homeగాసిప్స్బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు?

బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు?

బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు?
బాబా భాస్కర్ ను ఎందుకు బిగ్ బాస్ లేపుతున్నాడు?

బిగ్ బాస్ లో నాగార్జున ఎవరినైనా ప్రశ్నించాడా అంటే అది బాబా భాస్కర్ ను మాత్రమే. ఎవరిదైనా తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేశాడా అంటే అది బాబా భాస్కర్ నే. ఈ సీజన్ లో నాగార్జున హోస్టింగ్ చూస్తే అసలు ఎపిసోడ్స్ చూడట్లేదనే విషయం అర్ధమైపోతుంది. మరి హోస్టింగ్ చేసేటప్పుడు మైక్రో ఫోన్ లో నాగార్జునకు సూచనలు ఇచ్చేది ఎవరో, హోస్టింగ్ కు ముందు నాగార్జునకు బ్రీఫింగ్ ఇచ్చేది ఎవరో కానీ వారికి బాబా భాస్కర్ అంటే ఇష్టం లేదనుకుంటా. అందుకే ఐదవ వారం నుండి అనుకుంట బాబా భాస్కర్ ను ఎలాగైనా టార్గెట్ చేయాలని చూసారు. బాబా భాస్కర్ కు బాబా మాస్కర్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. బాబా భాస్కర్ కామెడీ చేస్తుంటే ప్రతిసారి కామెడీ ఏంటని అన్నారు. అదే డల్ గా ఉండిపోతే ఇలా ఉండిపోతే కష్టం అన్నారు. ఇలా ప్రతిసారి బాబా భాస్కర్ ను వీలైనంత బ్యాడ్ చేయాలని చూసారు. కానీ బాబా మాత్రం అంత త్వరగా లొంగలేదు. పరిస్థితులకు ఎదురువెళ్ళాడు. భాష సమస్యను అధిగమించాడు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. నిజానికి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు కొన్ని భాష సమస్య వల్ల బాబా భాస్కర్ కు అర్ధమయ్యేది కాదు. ఎందుకంటే శ్రీముఖి, శివజ్యోతి లా బాబా భాస్కర్ వరసగా అన్ని భాషల్లో అన్ని బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసి ప్రిపేర్ అయ్యి రాలేదు. తనకు తెలిసిందల్లా ఒకటే, పోదున్నే లేవడం, నవ్వుతూ ఉండడం, అందరికీ వండి పెట్టడం, టాస్క్ లలో ఇరగదీయడం. నిజానికి బాబా భాస్కర్ ఇంత బాగా టాస్క్ ఆడతాడని బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఊహించలేదు. అందుకే శ్రీముఖి, అలీతో టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఇచ్చినప్పుడు ఫిజికల్ టాస్క్ లు ఇచ్చాడు. కానీ శ్రీముఖిపై బాబా గెలవగా, అలీ చేసిన తప్పు వల్ల టాస్క్ రద్దయింది. అక్కడ కూడా బాబా భాస్కర్ లాస్ట్ వరకూ అలీకి టఫ్ ఫైట్ ఇచ్చాడు. టికెట్ టు ఫినాలే గెలుచుకోలేకపోయినా అభిమానుల సపోర్ట్ తో బాబా భాస్కర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు.

ఎంత ఆపుదామని ప్రయత్నించినా బాబా భాస్కర్ ఫైనల్స్ కు రావడంతో బిగ్ బాస్ తన స్ట్రాటజీని మార్చేశాడు. ఇప్పుడు తనకి ఎలివేషన్స్ ఇస్తున్నాడు. నిన్న, ఈరోజు ఎపిసోడ్ లో ఫైనల్స్ కు చేరిన హౌజ్ మేట్స్ కు చెందిన జర్నీని చూపించగా అందులో బాబా భాస్కర్ జర్నీ హైలైట్ గా నిలిచింది. తన ఏవీ కట్ చేసినన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ఇంక ఎవరి వీడియోకు కూడా వాడలేదు. బాబా భాస్కర్ ను సూపర్ స్టార్ అని సంబోధించడం దగ్గరనుండి బాబా భాస్కర్ జర్నీ ది బెస్ట్ అనేలా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రాజెక్ట్ చేసారు. హౌజ్ లో పెద్దగా ఎమోషనల్ అవ్వని బాబా భాస్కర్ కూడా ఆ ఏవీ చూసి చాలా సేపు ఎమోషనల్ అయిపోయాడు. మిగతా ఎవరితో కూడా ఎక్కువసేపు మాట్లాడని బిగ్ బాస్, బాబా భాస్కర్ తో మాత్రం చాలా సేపు కబుర్లు చెప్పాడు. హౌజ్ లో అందరూ ఎమోషనల్ అయినా కూడా బాబా భాస్కర్ నే కారణమడిగి తెలుసుకున్నారు. నిన్న ఎపిసోడ్ లో రాహుల్, వరుణ్, బాబా భాస్కర్ జర్నీ చూపించేయగా.. ఈరోజు ఎపిసోడ్ లో శ్రీముఖి, అలీ జర్నీ చూపించారు. వీళిద్దరిదీ అయితే మరీ ఫ్లాట్ గా కట్ చేసారు.

- Advertisement -

చూస్తుంటే బిగ్ బాస్ ఇక రెండు రోజులే ఉండడంతో ఓటర్లను ప్రభావితం చేయడానికి చూస్తున్నాడనిపిస్తోంది. అన్నట్టు బిగ్ బాస్ 2 షో విన్నర్ కౌశల్ ఫైనల్స్ కు చేరిన ఐదుగురిలో ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోవడానికి ఒక ప్లాన్ చెప్పాడు. ఆట, మాట, బాట అంటూ మూడు కాలమ్స్ గీసుకుని ప్రతి కంటెస్టెంట్ ఆట ఎలా ఆడాడు, ఎంత వరకూ ఎఫర్ట్ పెట్టాడు, మాటతీరు ఎలా ఉంది, ఫైనల్స్ కు వెళ్ళడానికి వేసుకున్న బాటలో ఎంత నిజాయితీ ఉంది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఓటు వేయమని చెప్పాడు. ఈ వీడియో కింద కామెంట్స్ ను పరిశీలిస్తే అందరూ రాహుల్ కు ఒక్క క్వాలిటీ కూడా లేదనడం విశేషం. ఎక్కువ మంది శ్రీముఖి, బాబా భాస్కర్ లలో ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. మరి నిజంగానే వీరిద్దరూ టాప్ 2 చేరుకుంటారా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All