Homeటాప్ స్టోరీస్మూడు అవతారాల్లో నాగ్ రఫ్ఫాడించాడు కదా!

మూడు అవతారాల్లో నాగ్ రఫ్ఫాడించాడు కదా!

మూడు అవతారాల్లో నాగ్ రఫ్ఫాడించాడు కదా!
మూడు అవతారాల్లో నాగ్ రఫ్ఫాడించాడు కదా!

తెలుగువారికి మరింత వినోదం అందించడానికి వచ్చేస్తోంది బిగ్ బాస్. ఈ షో ఎంత కాంట్రవర్సీ అయినప్పటికీ చాలా పాపులర్ అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తవ్వగా, ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. ప్రస్తుతం నాలుగో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సెట్ వర్క్స్, కంటెస్టెంట్స్ ఫైనల్ చేయడం, బిగ్ బాస్ షో నిర్వహణ పద్దతి వంటివన్నీ చూస్తున్నారు యాజమాన్యం. ఇక ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం పూర్తి జాగ్రత్తల మధ్య షో ను నిర్వహించనున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే షో ను నిర్వహించడం మీద కసరత్తులు చేస్తున్నారు. ఈ నెలాఖరు నుండి బిగ్ బాస్ మొదలవుతుందని అంటున్నారు.

మూడో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, నాలుగో సీజన్ కు కూడా హోస్టింగ్ చేయనున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ నాగార్జున ప్రోమో ఇప్పుడు విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున మూడు అవతారాల్లో కనిపించడం విశేషం. అటు ముసలాయన పాత్రలో, ఒక మధ్యవయస్కుడి పాత్ర, అలాగే ఒక యువకుడి పాత్రలో నాగ్ అందరినీ మెప్పించాడు. షో మీద ఆసక్తి కలిగించేలానే ఉందీ ప్రోమో. ఎప్పుడూ లేనంత వినోదం అంటూ నాగార్జున సందడి చేస్తున్నాడు. మరి చూడాలి ఈ షో ఎప్పటినుండి మొదలై ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All