
బిగ్ బాస్ అనేది పేరుకి ఒక రియాలిటీ షో. కానీ ఇక్కడ జరిగేదంతా ప్రేక్షకుల చేతుల్లో ఉండదు. ఏవో ఓట్స్ వేసి మనకు నచ్చిన వాళ్ళను సేవ్ చేసుకున్నామని ప్రేక్షకులు ఆనందపడిపోతారు కానీ ప్రేక్షకులకు ఏది చూపించాలో, ఏది చూపించకూడదో నిర్వాహకులు డిసైడ్ అవుతారు. ఉండాల్సిన వాళ్ళ గురించి పాజిటివ్ గా చెప్పించడం, బయటకు పంపాలన్న వాళ్ళ గురించి నెగటివ్ గా మాట్లాడించడం వంటివి బిగ్ బాస్ లో సర్వసాధారణం.
ప్రస్తుతం బిగ్ బాస్ లో బాబా భాస్కర్ టార్గెట్ అయిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. దానికి రెండు ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి ఫేక్ ఎలిమినేషన్ కు వెళ్లి, సీక్రెట్ రూమ్ లో ఒక రోజు ఉండి హౌజ్ లోకి వచ్చినప్పుడు బాబా భాస్కర్ తో తేల్చుకోవాల్సి ఉందని అన్నాడు. అలా ఎందుకన్నాడో ప్రేక్షకులకు మాత్రం అర్ధం కాలేదు.
అలాగే బాబా భాస్కర్ తో అప్పటిదాకా చాలా క్లోజ్ గా ఉన్న అలీ, రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చాలా నెగటివ్ గా మాట్లాడుతున్నాడు. దానికి రీజన్ మాత్రం ఎప్పుడో అలీ, పునర్నవితో కలిసి సీక్రెట్ రూమ్ కు వెళ్లిన దాని గురించి చెప్తున్నాడు. దాని తర్వాత కూడా చాలా రోజులు ఇద్దరూ కలిసి ఉన్నారు. కానీ రీ ఎంట్రీ తర్వాత ఈ టాపిక్ గురించి ఎందుకు చెప్తున్నాడో మాత్రం అటు బాబా భాస్కర్ కు ఇటు ప్రేక్షకులకు కూడా అర్ధం కావట్లేదు. ఇదంతా బిగ్ బాస్ కావాలని చేస్తున్నదే అంటున్నారు.