Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 3 లో మారిన షెడ్యూల్.. బాబా భాస్కర్ కు స్వీట్ షాక్

బిగ్ బాస్ 3 లో మారిన షెడ్యూల్.. బాబా భాస్కర్ కు స్వీట్ షాక్

బిగ్ బాస్ 3 లో మారిన షెడ్యూల్.. బాబా భాస్కర్ కు స్వీట్ షాక్
బిగ్ బాస్ 3 లో మారిన షెడ్యూల్.. బాబా భాస్కర్ కు స్వీట్ షాక్

బిగ్ బాస్ లో నిన్న బాబా భాస్కర్ కు స్వీట్ షాక్ తగిలింది. సాధారణ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిన బాబా భాస్కర్, మహా అయితే రెండు లేదా మూడు వారాలు ఉంటాడు అనుకున్నారు. బాబా భాస్కర్ కూడా అదే చెప్పుకొచ్చాడు. తాను రెండు వారాలకు మించి ఉండనేమోనని, అందుకే బట్టలు కూడా రెండు వారాలకు సరిపడా తెచుకున్నానని బాబా భాస్కర్ తెలిపాడు. అయితే తనదైన కామెడీ టైమింగ్ తో అందరి మీద పంచ్ లు వేస్తూ బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ గా నిలిచాడు. మొదట్లో అంతగా ఓపెనప్ అవ్వకపోవడం బాబా భాస్కర్ కున్న నెగటివ్ కాగా నెమ్మదిగా ఆ విషయంలోనూ కరెక్ట్ చేసుకున్నాడు.

ఇంట్లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ అసలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే మర్చిపోయిన తరుణంలో బాబా భాస్కర్ ఒక్కడే కొంచెం కామెడీ చేసి స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా అని చెప్పి కామెడీ ఒకటే చేస్తాడనుకుంటే పొరబాటే. ఇంట్లో ప్రతిరోజూ అందరికీ వండి పెడుతూ ఒక్కరోజు కూడా విసుగు లేకుండా చేసుకొచ్చాడు. ఇక టాస్క్ లు ఇస్తే 100 శాతం ఇవ్వడమే అతనికి తెలుసు. అందుకే బాబా భాస్కర్ అందరికీ ఫేవరెట్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 3 లో ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టిన సెకండ్ కంటెస్టెంట్ గా బాబా భాస్కర్ నిలిచాడు. ఇప్పటికే రాహుల్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి ఫైనల్స్ కు చేరుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు బాబా భాస్కర్ కూడా ఫైనల్స్ కు చేరడంతో మిగిలిన నలుగురు హౌజ్ మేట్స్ లో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ప్రస్తుతం శ్రీముఖి, వరుణ్ సందేశ్, శివ జ్యోతి, అలీ నామినేషన్స్ లో ఉన్నారు. ఈరోజు శనివారం నాగార్జున రానున్నాడు కాబట్టి కనీసం ఒకరినైనా సేవ్ చేస్తారేమోనన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తుంటే అలీ లేదా శివజ్యోతికి మూడినట్లే అనిపిస్తోంది. మరి అందరి అంచనాల ప్రకారం వీరిద్దరిలో నుండే ఒకరు ఎలిమినేట్ అవుతారా లేక అందరికీ షాక్ ఇస్తూ వరుణ్, శ్రీముఖిలలో ఒకరు వెళ్ళిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అసలు ఈరోజు నాగార్జున వచ్చి ఏం మాట్లాడనున్నాడా అని అందరికీ ఆసక్తిగా ఉంది.

ఇది పక్కన పెట్టి అసలు నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి గమనిస్తే… నిన్న రాత్రి వరకూ కంటెస్టెంట్స్ కు ఎటువంటి టాస్క్ లు ఇవ్వకపోవడంతో అందరూ రిలాక్సింగ్ మూడ్ లోకి వెళ్లారు. కానీ రాత్రి ప్రముఖ షాపింగ్ మాల్ కెఎల్ఎం వారి నుండి వచ్చిన స్పెషల్ బట్టలు వేసుకుని హౌజ్ మేట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ర్యాంప్ మీద వాక్ చేసారు. దాని తర్వాత లేడీ కంటెస్టెంట్స్, జెంట్స్ లో ఒకరిని సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే జెంట్స్ అందరూ కలిసి అమ్మాయిలలో ఒకరిని బెస్ట్ గా ఎంపిక చేయాలి. ఇలా సెలెక్ట్ అయిన ఇద్దరికీ చెరొక 10,000 రూపాయల షాపింగ్ వౌచర్ లభిస్తుంది, అలాగే కెఎల్ఎం ఫ్యాక్షనిష్టా ట్యాగ్ కూడా ఇస్తారు. ఇందులో బాబా భాస్కర్, శ్రీముఖి గెలుపొందారు.

ఇక అందరూ పడుకున్న సమయంలో రాత్రి 3.30 నిమిషాలకు బిగ్ బాస్ సైరన్ మోగించి అందరినీ నిద్ర లేపాడు. దాని తర్వాత నామినేట్ అయిన సభ్యులందరూ తమ బట్టలు ప్యాక్ చేసుకుని గార్డెన్ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ చెప్పాడు. అందరూ వచ్చిన తర్వాత పోడియంస్ మీద నిలబడమని చెప్పి ఒక్కొక్కరినీ బిగ్ బాస్ లో తమ జర్నీ గురించి వివరించమని అడిగారు. అది కూడా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నామినేషన్స్ నుండి సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All