Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ రీ యూనియన్ : నెమరువేసుకున్న పాత జ్ఞాపకాలు

బిగ్ బాస్ రీ యూనియన్ : నెమరువేసుకున్న పాత జ్ఞాపకాలు

బిగ్ బాస్ రీ యూనియన్ : నెమరువేసుకున్న పాత జ్ఞాపకాలు
బిగ్ బాస్ రీ యూనియన్ : నెమరువేసుకున్న పాత జ్ఞాపకాలు

బిగ్ బాస్ ప్రతి సీజన్ లోనూ కొన్ని ఆనవాయితీగా జరుగుతాయి. నామినేషన్, ఎలిమినేషన్ తరహాలో సీజన్ లాస్ట్ కు వచ్చినప్పుడు బిగ్ బాస్ రీ యూనియన్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇంట్లోకి తొలిసారి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అందరూ సీజన్ లాస్ట్ కు వచ్చేసరికి తిరిగి కలుస్తారు. బోలెడు విషయాలు పంచుకుంటారు. పాత గుర్తుల్ని నెమరువేసుకుంటారు. బయట ఏం జరుగుతోందో ఫైనల్స్ కు వెళ్లిన వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా ఈ బిగ్ బాస్ రీ యూనియన్ అనేది ఎంతో ఫన్ గా ఉంటుంది. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో అదే జరిగింది. బిగ్ బాస్ రీ యూనియన్

- Advertisement -

సందర్భానికి తగినట్లుగా పాట వేయడం బిగ్ బాస్ లో అలవాటే. అందుకే ఈరోజు రీ యూనియన్ కాబట్టి హ్యాపీ డేస్ నుండి ఓ మై ఫ్రెండ్ సాంగ్ వేశారు. ఈ పాటకి ఫైనల్స్ కు చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్ కలిసి డ్యాన్స్ చేయడం బాగుంది. మార్నింగ్ నుండే బిగ్ బాస్ రీ యూనియన్ మొదలైపోయింది. ఫస్ట్ గా ఇంట్లోకి రవి వచ్చాడు. అది కూడా అలీ మెయిన్ డోర్ దగ్గరకి వచ్చినప్పుడే అలీ ఎంట్రీ జరిగింది. అలీ, రవి బయట ఎంత మంచి ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే.

ఇక సెకండ్ కంటెస్టెంట్ గా జాఫర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి కూడా జాఫర్ తో క్లోజ్ గా మూవ్ అయిన బాబా భాస్కర్ మెయిన్ డోర్ దగ్గరకి వచ్చినప్పుడే జరిగింది. జాఫర్ రాగానే బాబా భాస్కర్ ను వాటేసుకున్నాడు. ఇద్దరూ చాలా సేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు చాలా డల్ గా కనిపించిన జాఫర్ ఈ ఎపిసోడ్ లో చాలా ఉత్సాహంగా కనిపించాడు. జోకులు వేస్తూ, తన మీద పంచ్ లు వేయించుకుంటూ జాఫర్ రెండు వారాలు హౌజ్ లో ఉన్నప్పుడు ఇవ్వలేని ఎంటర్టైన్మెంట్ రీ యూనియన్ లో ఉన్న కొద్ది సేపట్లోనే ఇచ్చాడు. ఇదే జోష్ తో ముందు నుండి ఉండి ఉంటే హౌజ్ లో ఇంకా ఎక్కువ కాలం కొనసాగేవారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక వారిద్దరి తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా తర్వాత గ్రూప్స్ లో అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ హౌజ్ లోకి వచ్చారు. బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన రోహిణి, అషు రెడ్డి కలిసి ఎంట్రీ ఇచ్చారు. పునర్నవి, వితిక కలిసి ఎంట్రీ ఇచ్చారు. శివజ్యోతి, మహేష్, శిల్ప కలిసి ఎంట్రీ ఇచ్చారు. తమన్నా సింగిల్ గా ఎంట్రీ ఇచ్చింది. హిమజ కూడా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ 3 లో అందరి కంటే ముందు ఎలిమినేట్ అయిన హేమ, అందరికంటే లాస్ట్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హేమ వచ్చిన తర్వాత శ్రీముఖి వచ్చి అక్కా అంటూ కాళ్ళ మీద పడిపోతుంటే వద్దమ్మా ఇలానే నా కొంప ముంచారు అంటూ సెటైర్ వేసింది.

అందరూ కలిసాక ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పునర్నవి రాహుల్ ను పిలిచి శ్రీముఖితో గొడవను పక్కనపెట్టేసి కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి అని సలహా ఇచ్చింది. దానికి రాహుల్ మా ఇద్దరి మధ్య ఇప్పుడు బానే ఉంది. ఇద్దరం కలిసి డ్యాన్స్ కూడా చేస్తున్నాం మార్నింగ్ అని చెప్పాడు. ఇక కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ లివింగ్ ఏరియాలో కూర్చోమని చెప్పి అందరి జర్నీని చూపించారు. వాళ్ళ మధ్య జరిగిన సరదా సరదా ఇన్సిడెంట్స్ ను ఏవీ గా కట్ చేసి ప్రెజంట్ చేసారు. అది అందరికీ మంచి ఫీల్ ను పంచింది.

ఆ ఏవీ అయిపోయాక తమన్నా చాలా ఫీల్ అయిపోయి, ఎమోషనల్ అయిపోయి రవికి అందరి ముందూ సారీ చెప్పింది. ఏదో నా గుర్తింపు కోసం నిన్ను టార్గెట్ చేసాను చాలా సారీ అని చెప్పింది. దీంతో వీళ్లిద్దరి మధ్య వచ్చిన గ్యాప్ తగ్గింది. ఇక నైట్ బిగ్ బాస్ రెట్రో స్టైయిల్ పార్టీ అరేంజ్ చేసాడు బిగ్ బాస్. దీనికి యాంకర్స్ గా జాఫర్, బాబా భాస్కర్ వ్యవహరించారు. ఈ ఫంక్షన్ రేపు కూడా ఉంటుంది. అయితే రేపు ఎపిసోడ్ లో మహేష్ ఎందుకో ఫీల్ అయిపోయి పార్టీలో అందరికీ అవార్డ్స్ ఇస్తున్న సందర్భంగా నాకు అవార్డు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ సరదాగా ఉన్న సమయంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాలి మరి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts