
మొదటినుండి బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు చేస్తున్న కంప్లైంట్ ఒకటే. ఈ సీజన్ శ్రీముఖి కి ఎక్కువ ఫేవర్ గా ఉందని. సీజన్ మొదటి నుండి ఆమె ఫుటేజ్ ఎక్కువ టెలికాస్ట్ చేయడం, ఆమెనే ఎక్కువ హైలైట్ చేయడం వంటివి జరుగుతూ వచ్చాయి. అయితే అనుకోకుండా అలీ రెజా ఎలిమినేట్ కావడం, ‘ఆ నలుగురు’గా గ్రూప్ అయిన వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్ గ్రూప్ గా చాలా స్ట్రాంగ్ అవడంతో శ్రీముఖి గత వారం బాగా డల్ అయిపోయింది.
అయితే ఇక్కడే బిగ్ బాస్ తన స్ట్రాటజీని అమలు చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి ఓటింగ్ లేకుండా అలీ రెజాను వైల్డ్ కార్డు పేరుతో ఇంట్లోకి పంపడంతో శ్రీముఖి కొండంత బలం వచ్చినట్లైంది. దానికంటే ముందు ఇటుకుల టాస్క్ లో ‘ఆ నలుగురు’ మధ్య గొడవై ఈ గ్రూప్ విడిపోవడం కూడా శ్రీముఖికి ప్లస్ అయింది.
దీంతో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో శ్రీముఖిని ఎదురించే వారే లేకుండా పోయారు. కనీసం తనను కదపడానికి కూడా ఎవరూ సాహసించలేదు. రాహుల్, పునర్నవి కూడా శ్రీముఖి కెప్టెన్సీకి సపోర్ట్ చేసారు. ఇప్పుడు శ్రీముఖి కెప్టెన్ కావడంతో ఒక వారం రోజుల పాటు ఆమెకు ఎదురులేదు. అప్పటికి ఇంట్లోంచి ఇద్దరు వెళ్ళిపోతారు. మొత్తానికి శ్రీముఖికి బిగ్ బాస్ ఫేవర్ గా ఉందన్న వాదన ఇప్పుడు మరింత బలపడింది.