Homeటాప్ స్టోరీస్వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్

వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్

వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్
వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్

బిగ్ బాస్ అంటే రకరకాల ఎమోషన్స్ ను చూపిస్తుంది. హౌజ్ లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ ఎలాంటివాడైనా సరే ఎమోషన్స్ అన్నిటీనీ దాటుకుని ముందుకెళ్లాల్సిందే. కోపం, బాధ, ప్రేమ, ఆనందం.. ఇలా భావాలు ఏవైనా వాటిని వ్యక్తపరచకుండా ఉండలేరు. అదే బిగ్ బాస్ ఉండనివ్వడు. ఇద్దరు స్నేహంగా ఉంటే వారి మధ్య గొడవలు పెట్టి వాళ్ళ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అన్నది చూస్తాడు. ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే వారిని ఒక టీమ్ గా పెట్టి టాస్క్స్ ఆడిస్తాడు. మొత్తానికి ఒకే రకమైన ఎమోషన్ తో ఎవరినీ ఉంచడు బిగ్ బాస్. అందరినీ నవ్వించే బాబా భాస్కర్ ను ఏడిపించగలడు. అందరిచేత మిస్టర్ కూల్ అనిపించుకున్న వరుణ్ సందేశ్ కి కోపం తెప్పించగలడు, టాస్క్ లంటే 100 శాతం ఇచ్చే అలీను టాస్క్ నుండి ఎలిమినేట్ చేయగలడు, పెద్దగా ఎమోషన్స్ బయటకు రానివ్వడానికి ఇష్టపడని రాహుల్ చేత ఎమోషనల్ అయ్యేలా చేయగలడు, ఇంకా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖిని డల్ గా మార్చేయగలడు. ఇలా ఒక పర్సన్ ఎలా ఉంటాడో వాడిలోని ఆపోజిట్ కోణాన్ని ఆవిష్కరించగలడు. అందుకే బిగ్ బాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయింది.

బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మరొక మూడు రోజులాగితే విన్నర్ ఎవరన్నది తేలిపోతుంది. ప్రస్తుతం ఉన్న ఐదుగురు హౌజ్ మేట్స్ లో ఎవరికి వారే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక లాస్ట్ వీక్ కావడంతో బిగ్ బాస్ కూడా పెద్దగా ఏం టాస్క్స్ ఇవ్వట్లేదు. హౌజ్ మేట్స్ దీంతో బాగా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నారు. తమ జర్నీని ఆస్వాదిస్తున్నారు. జరిగిన గొడవలను మర్చిపోయి అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు.గత రెండు ఎపిసోడ్స్ సుమ వచ్చి ఫుల్ ఫన్ జనరేట్ చేసి వెళ్ళిపోయింది. సుమ వచ్చినప్పుడే ప్రతి కంటెస్టెంట్ కు వచ్చిన ఫ్యాన్ మెయిల్స్ ను చదివించారు. ఇందులో కంటెస్టెంట్ గురించి గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉన్నాయి. ఇక సుమ వెళ్ళిపోయాక బిగ్ బాస్ పెద్ద టాస్క్ ఏం పెట్టకుండా భవిషత్తు గురించి డౌట్స్ ఉంటే అడిగి తీర్చుకోండి అని ఒక స్పెషలిస్ట్ ను హౌజ్ లోకి పంపిన విషయం తెల్సిందే. ఇక ఈరోజు ఉదయం కంటెస్టెంట్స్ ను లేపాక సాయంత్రం 6 గంటల వరకూ కంటెస్టెంట్స్ కు ఏ పని లేదు. అలా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేసారు.

- Advertisement -

అయితే ఆరు తర్వాత హౌజ్ మేట్స్ అందరికీ ఒక సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పంపి వారి జర్నీని చూపించి, వారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పి కీలకమైన ఫైనల్ ఎపిసోడ్ కు ముందు వారిని సమాయత్తం చేసాడు. ముందుగా వరుణ్ సందేశ్ ను యాక్టివిటీ ఏరియాకు పిలిపించిన బిగ్ బాస్, ఆ రూమ్ లో అప్పటికే హౌజ్ మేట్స్ ఆడిన టాస్క్ లకు సంబంధించిన గుర్తులను పెట్టి అక్కడ ఒక పోడియం మీద నిలబడమని చెప్పి వరుణ్ గురించి, తను ఎందులో తోపు అన్నది వివరించడం, వారికి సంబంధించిన వీడియోను స్పెషల్ గా కట్ చేయడం వంటివి హౌజ్ మేట్స్ ను ఎమోషనల్ చేసేశాయి. వరుణ్ ను మిస్టర్ పెర్ఫెక్ట్, సూపర్ కూల్ అన్నట్లుగా బిగ్ బాస్ కొనియాడారు. తన వీడియోను చూసుకున్న వరుణ్ సందేశ్ బయటకు వచ్చి హౌజ్ మేట్స్ అందరితో లోపలవీడియో సూపర్ గా ఉంది అని చెప్పాడు. ఒక మంచి ఫీల్, పాజిటివ్ ఎనర్జీ వచ్చాయని అన్నాడు.

వరుణ్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ వంతు. రాహుల్ ను మొదట అందరూ లేజి అని వంక పెట్టి నామినేట్ చేయడం దగ్గరనుండి తను ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు, బిగ్ బాస్ 3 లోకి ఎంటర్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎలా నిలిచాడు అన్నది ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. రాహుల్ కూడా ఈ వీడియో చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. ఇక బాబా భాస్కర్ రావడమే నేను అసలు ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్నాడు. కానీ వీడియో చూసిన తర్వాత బాబా భాస్కర్ ఎందుకో విపరీతంగా ఎమోషనల్ అయిపోయాడు. వీడియో గురించి మాట్లాడుకుంటే ఈరోజు ప్లే చేసిన ముగ్గురిలో బాబా భాస్కర్ కు ది బెస్ట్ కట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఒక సూపర్ స్టార్ రేంజ్ లో బాబా భాస్కర్ ను ఎలివేట్ చేసిన తీరు సూపర్బ్. రేపటి ఎపిసోడ్ లో శ్రీముఖి, అలీల వీడియోలు ప్లే అవుతాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All