Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ లో ఓట్ల కోసం కంటెస్టెంట్స్ పాట్లు

బిగ్ బాస్ లో ఓట్ల కోసం కంటెస్టెంట్స్ పాట్లు

బిగ్ బాస్ లో ఓట్ల కోసం కంటెస్టెంట్స్ పాట్లు
బిగ్ బాస్ లో ఓట్ల కోసం కంటెస్టెంట్స్ పాట్లు

చూస్తుండగానే బిగ్ బాస్ లో 100 రోజులు గడిచిపోయాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 3 చివరి వారానికి చేరుకుంది. ఫైనల్స్ లోకి రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్, అలీ చేరుకున్నారు. ఇక ఒకే వారం కావడంతో కంటెస్టెంట్స్ అందరూ ఫ్యాన్స్ కు నచ్చేలా ఉండడానికి ఏం చేయాలో అంతా చేస్తున్నారు. ఇన్నాళ్లు పెద్దగా ఏం కష్టపడకుండానే ఫైనల్స్ కు చేరుకున్న రాహుల్ సిప్లిగంజ్ వద్దన్నా పాటలు తెగ పడేస్తున్నాడు. ఇన్నాళ్లలో నాగార్జున అడిగితేనే పాటలు పాడే రాహుల్.. ఊరికే అలా కూర్చుని కూడా పాటలు పడుతూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎపిసోడ్ లో కూడా రాహుల్, వరుణ్ తో కలిసి ఒక పాట పాడాడు. సుమ వచ్చినప్పుడు ఒక పాట పాడాడు. అలీ అడిగినప్పుడు అయితే బిగ్ బాస్ ను కూడా లెక్క చేయకుండా హిందీలో పాట పాడాడు. ఇవన్నీ ముందు నుండి చేసి ఉంటే మనకెంత ఎంటర్టైన్మెంట్ దొరికుండేదో కదా!

- Advertisement -

ఇక శ్రీముఖి గురించి చెప్పేదేముంది. ఆమె ముందు నుండి ఇంతే. అటెంషన్ సీకర్ అని చెప్పవచ్చు. ఎవరైనా స్క్రీన్ స్పేస్ తీసుకుంటుంటే అక్కడ తను ఉండాలి అనుకుంటుంది. ఇప్పటిదాకా అన్ని బిగ్ బాస్ లు చదివేసి వాటిని ఔపోసన పట్టేసిన శ్రీముఖి, ఏ టాస్క్ ఎందుకో, ఎక్కడ వస్తుందో, దానికి ఎలా ఆడాలో కూడా చెప్పేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో అందరికీ ఫ్యాన్ మెయిల్స్ వచ్చినప్పుడు అందులో ఒకరు సరిగ్గా ఇదే పాయింట్ చెప్పారు. అంటే పొడిగిన మెసేజెస్ కూడా వచ్చాయి. శ్రీముఖి ఫుల్ ఎనెర్జిటిక్ ఈ విషయంలో డౌటే లేదు. కానీ ప్రతిసారి అలా గట్టిగా అరుస్తూ ఉంటే ఎవరికైనా చిరాకు ఎందుకు రాదు చెప్పండి. దీనికితోడు నాగార్జున కూడా ఈ అరుపులను సపోర్ట్ చేయడమేంటో!

బాబా భాస్కర్ విషయానికి వస్తే ఆయన ప్రతిసారి నేను 2 వీక్స్ కే ప్రిపేర్ అయి వచ్చాను అంటూ ఉన్నాడు. బిగ్ బాస్ నెగ్గడంపై తనకి పెద్ద ఆసక్తి లేదన్నట్లు మాట్లాడతాడు ప్రతిసారి. సుమ వచ్చినప్పుడు బాబా భాస్కర్ కు ఈ విషయం మీదే క్లాస్ తీసుకుంది. అతను ఉండాలని ఓట్లు వేసే ప్రేక్షకులు ఉన్నప్పుడు ఇలా నాకు నెగ్గకపోయినా పర్లేదు అన్నట్లు మాట్లాడటం ఏంటో ఆయనకే తెలియాలి. ఫ్యాన్ మెయిల్ లో ఒక మెసేజ్ బాబా భాస్కర్ కు వ్యతిరేకంగా వచ్చింది. బాబా ‘భాస్కర్’ కాదని బాబా ‘మాస్కర్’ అని ఇంకా మాస్క్ తీయకుండానే ఆడుతున్నాడని చెప్పాడు. మరి ఇంట్లో ఉండడం తనకేం పెద్ద ఇంపార్టెంట్ కాదంటూనే బాబా ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నాడో. దీనికి సమాధానంగా బాబా భాస్కర్ టాస్క్ లు ఆడతానని, ఫలితం ఆశించనని చెప్తాడు. బిగ్ బాస్ టైటిల్ ఆశించనని అలా అని చెప్పి ఇస్తే వద్దు అననని అంటాడు. ఈయన లాజిక్స్ కొంచెం వెరైటీగానే ఉంటాయి మరి.

వరుణ్ అయితే బిగ్ బాస్ లాస్ట్ లో పూర్తిగా డల్ అయిపోయాడు. వితిక వెళ్లిన దగ్గరనుండి వరుణ్ చాలా డల్ గా కనిపిస్తున్నాడు. ఇదే విషయం ఫ్యాన్ మెయిల్ లో ఒకరు అడిగితే మొదట మాట దాటివేయడానికి చూసిన వరుణ్, మొత్తానికి రీజన్ చెప్పాడు. పెళ్ళైన తర్వాత ఇంత క్లోజ్ గా మేము గడిపింది లేదని, ఇన్ని రోజులు ఇలా ఎప్పుడూ లేమని, అందుకే కొంత డల్ అయినట్లు చెప్పాడు వరుణ్.

అలీ అయితే ప్రతిసారి రాహుల్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. తాను టాస్క్ లో తప్పు చేయడం వల్ల టికెట్ టు ఫినాలే గెలుచుకోలేకపోయానని ఎవరైనా అంటే వెంటనే రాహుల్ రెఫెరెన్స్ తెస్తున్నాడు. ఇలా టికెట్ టు ఫినాలే గెలుచుకునే కంటే నామినేషన్స్ లోకి వెళ్లి అక్కడినుండి సేవ్ అయ్యి రావడం తనకు చాలా కిక్ నిచ్చిందని చెప్పాడు అలీ. ఇది రాహుల్ కు కచ్చితంగా బ్యాడ్ చేస్తుంది. ఇలా అందరూ ఎవరికి నచ్చినట్లు వారు ఫ్యాన్స్ మనసు గెలుచుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. అదీ మ్యాటర్.

అన్నట్లు ఈరోజు ఎపిసోడ్ లో భవిష్యత్తు ఏంటో అని ఆందోళన పడుతున్న కంటెస్టెంట్స్ కు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఊహించగలిగే ఒక మనిషిని పంపారు. అందరూ తమకు దేని గురించి తెలియాలో దాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక రేపు ఏం అవుతుందో చూడాలి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts