
బిగ్ బాస్ 5 లో ఈ వారం టాస్క్ లు, నామినేషన్స్ తో అలిసిపోయిన కంటెస్టెంట్స్ నిన్నటి ఎపిసోడ్ లో కొంత రిలాక్స్ అయ్యారు. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో ఇద్దరి పుట్టినరోజు వేడుకలు చూపించారు. ముందు రోజు రాత్రి శ్వేతా వర్మ పుట్టినరోజు వేడుకలు జరగగా కంటెస్టెంట్స్ అందరూ కేక్ కట్ చేయించి విషెస్ చెప్పారు.
ఆ తర్వాత లోబో, ఉమా చేసిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో లోబో బెడ్ గెలుచుకోగా అది ఉమాకు గిఫ్ట్ కింద ఇచ్చాడు లోబో. ఇక షణ్ముఖ్, హమీదలను సరదాగా ఆటపట్టిస్తూ రవి మంచి ఫన్ జెనెరేట్ చేసాడు. దానికి షణ్ముఖ్ సిగ్గుపడిపోవడం కూడా బాగుంది. ఆ తర్వాత షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా తన పేరెంట్స్ విష్ చేయడం, ఆ తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా కూడా వీడియో మెసేజ్ చేయడం బాగుంది.
ఈ ఎపిసోడ్ లో ఎక్కువగా కంటెస్టెంట్స్ సరదాగానే గడపడం విశేషం.