Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచేది వీళ్లేనా?

బిగ్ బాస్ 5: కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచేది వీళ్లేనా?

బిగ్ బాస్ 5: కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచేది వీళ్లేనా?
బిగ్ బాస్ 5: కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచేది వీళ్లేనా?

బిగ్ బాస్ సీజన్ 5 ప్రతీ రోజూ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే బిగ్ బాస్ 5 చిన్న చిన్న ట్విస్ట్ లతో ఒక ఫార్మాట్ ప్రకారం సాగుతోంది. సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ. మంగళవారం నుండి కెప్టెన్సీ టాస్క్, ఆ తర్వాత రిలాక్స్ మోడ్ అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఇక ఆ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ఇంటి నుండి లెటర్స్ రావడంతో చాలా ఎమోషనల్ గా సాగింది. కొంత మంది లెటర్స్ ను త్యాగం చేసారు. దానివల్ల వారు నామినేషన్స్ లో కూడా నిలిచారు.

ఇక నిన్న కెప్టెన్సీ టాస్క్ ను ఇచ్చారు బిగ్ బాస్. దాని ప్రకారం హౌజ్ లో అంతా లాక్ డౌన్ లో ఉందని, హౌజ్ మేట్స్ ఒకరితో ఒకరు పోటీ పడితే ఇంటి లోపలికి యాక్సిస్ లభిస్తుందని తెలిపాడు. అలాగే టాస్క్ లలో గెలిచిన వారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు. నిన్న మొత్తం మూడు టాస్క్ లు జరగ్గా వాటిలో విజయం సాధించి షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ చంద్ర కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఇంకా రెండు టాస్క్ లు ఈరోజు జరుగుతాయి.

- Advertisement -

అయితే మిగతా ఇద్దరు ఎవరు అన్న సస్పెన్స్ కు తెరదించుతూ ఒక సమాచారం వచ్చింది. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ చంద్రతో పాటు మానస్, సన్నీ, ఎన్నీ మాస్టర్ లు కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడబోతున్నారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All