Homeన్యూస్జెస్సీ విషయంలో బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం ఏంటి?

జెస్సీ విషయంలో బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం ఏంటి?

జెస్సీ విషయంలో బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం ఏంటి?
జెస్సీ విషయంలో బిగ్ బాస్ తీసుకునే నిర్ణయం ఏంటి?

బిగ్ బాస్ సీజన్ 5 లో ట్విస్ట్స్, టర్న్స్ కు లోటు లేదు. ఆసక్తికరంగా సాగుతోన్న బిగ్ బాస్ ఇప్పుడు పదవ వారంలోకి అడుగుపెడుతోంది. ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు ఉన్నారు. మానస్, సన్నీ, కాజల్, సిరి, రవిలు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న సస్పెన్స్ కు జెస్సీ ఇంటి నుండి బయటకు వెళ్లడం కొత్త ట్విస్ట్ ను ఇచ్చింది.

జెస్సీ కొంత కాలంగా వెర్టిగో సమస్యతో బాధపడుతున్నాడు. దీని కారణంగానే కొన్ని టాస్క్ లను కూడా ఆడలేదు. అయితే రోజులు గడుస్తున్నా సమస్య తీరకపోవడంతో జెస్సీను ఇంటి నుండి బయటకు రమ్మని బిగ్ బాస్ తెలిపాడు. కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చారు. అందరూ జెస్సీ ఎలిమినేట్ అయినట్లే అని భావించారు కానీ తనను బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్ లో కూర్చోపెట్టారు. జెస్సీ ఇంకా గేమ్ లో ఉన్నాడని బిగ్ బాస్ తెలిపాడు.

- Advertisement -

ఒకవైపు కంటెస్టెంట్స్ అందరూ జెస్సీ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఈసారి తమకు ఎలిమినేషన్ ఉండదని భావిస్తూ ఉండవచ్చు. మరోవైపు బిగ్ బాస్ జెస్సీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి జెస్సీ తిరిగి ఇంట్లోకి వస్తాడా లేక ఆదివారం నాగార్జునను కలిసి ఇంటి నుండి వెళ్ళిపోతాడా? దాన్ని బట్టి ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియ ఉండే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All