
బిగ్ బాస్ 5 లో వివాదాలకు లోటేమి ఉండదు. కంటెస్టెంట్స్ కు ఇచ్చే టాస్క్ లు కూడా అలాగే ఉంటాయి, కంటెస్టెంట్స్ ను రెచ్చగొట్టేలా. అయితే కంటెస్టెంట్స్ తమ కూల్ ను కోల్పోకుండా గేమ్ ఆడాల్సి ఉంటుంది. అదే వాళ్ళను స్పెషల్ గా నిలబెడుతుంది. ఇక నిన్న బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ అనే టాస్క్ ను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందులో నాలుగు టీమ్స్ గా డివైడ్ చేసారు. అలాగే సిరి, కాజల్ లను సంచాలకులుగా నియమించారు.
టాస్క్ ప్రకారం ముడి సరుకు ఇస్తే సాఫ్ట్ టాయ్స్ ను చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో భాగంగా మానస్, సన్నీ, ఎన్నీ మాస్టర్ లు ఒక టీమ్ కాగా శ్వేతా, రవి, లోబో మరొక టీమ్. టాస్క్ ఆడుతున్న సమయంలో రవి, శ్వేతా, లోబోలకు ఒక స్పెషల్ పవర్ వస్తుంది. దీని ప్రకారం ఏ టీమ్ వద్ద నుండైనా బొమ్మలను తీసేసుకోవచ్చు.
రవి టీమ్ ఈ పవర్ ను ఉపయోగించి మానస్ టీమ్ నుండి బొమ్మలను తీసేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎన్నీ మాస్టర్, శ్వేతా వద్దకు వెళ్లి బలవంతంగా బొమ్మలను లాగేసుకుని వాటిని పీకేశారు. దీంతో ఎన్నీ మాస్టర్, శ్వేతాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఈ ప్రోమో విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ లో దీని గురించి చూపిస్తారు.
Dispute between #Anee & #Sweta .. Who will win the task?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFire & #FiveMuchFun pic.twitter.com/ECmoMWRvWh
— starmaa (@StarMaa) October 13, 2021