Homeఎక్స్ క్లూసివ్బిగ్ బాస్ 5: ఆసక్తికర నామినేషన్స్ ప్రాసెస్ తో మొత్తం ఎనిమిది మంది..

బిగ్ బాస్ 5: ఆసక్తికర నామినేషన్స్ ప్రాసెస్ తో మొత్తం ఎనిమిది మంది..

బిగ్ బాస్ 5: ఆసక్తికర నామినేషన్స్ ప్రాసెస్ తో మొత్తం ఎనిమిది మంది..
బిగ్ బాస్ 5: ఆసక్తికర నామినేషన్స్ ప్రాసెస్ తో మొత్తం ఎనిమిది మంది..

బిగ్ బాస్ 5 లో ప్రతీసారిలా కాకుండా ఈసారి వినూత్నంగా నిర్వహించారు. సన్నీ, శ్రీరామ్, జెస్సీలను వేటగాళ్లుగా పేర్కొన్నాడు బిగ్ బాస్. మిగిలిన వాళ్ళందరి ఫోటోలు కోతి బొమ్మలు వేలాడదీసిన చెట్టుకి అతికించారు. అలాగే లివింగ్ రూమ్ లో ఒక అరిటిపండుని పెట్టారు. బజర్ మోగిన ప్రతీసారి ఇద్దరు హౌజ్ మేట్స్ ఆ అరిటిపండుని పట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అరిటిపళ్ళను పట్టుకున్నారో వారు ఒక్కొక్క పేరుని నామినేషన్ కు చెప్పాల్సి ఉంటుంది. తర్వాత హంటర్స్ కు మోగిన బజర్ కు ఎవరు ముందు వస్తారో వారు నామినేషన్ ను యాక్సప్ట్ చేయాల్సి ఉంటుంది.

అరిటిపళ్ళను పట్టుకున్న ఇద్దరు హౌజ్ మేట్స్ చెప్పిన కారణాలను విని ముందుగా బయటకు వచ్చిన వేటగాడు నిర్ణయం తీసుకుని నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి కోతి బొమ్మను కట్ చేసి బిన్ లో వేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్స్ ప్రాసెస్ లో మొత్తం ఏడుగురు నామినేషన్స్ లో నిలిచారు.

- Advertisement -

వేటగాళ్లలో శ్రీరామ్, జెస్సీలు నామినేట్ అవ్వగా హౌజ్ మేట్స్ లో సిరి, ప్రియా, రవి, కాజల్, ఎన్నీలు నామినేట్ అయ్యారు. ఇక డైరెక్ట్ నామినేషన్ తో లోబో కూడా ఈసారి లిస్ట్ లో ఉన్నాడు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All