
బిగ్ బాస్ సీజన్ 5 సజావుగా సాగుతోంది. ఈసారి మొదటి ఎపిసోడ్ ను సరైన ట్రాక్ లోనే నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగానే ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో జెస్సీ ఇంటి కెప్టెన్ అయ్యాడు. అంతకంటే ముందు ప్రియా నెక్ లెస్ దొంగిలించడం ద్వారా సీక్రెట్ టాస్క్ పూర్తి చేసి రవి కెప్టెన్సీ పోటీదారునిగా నిలిచాడు.
అలాగే నిన్నటి ఎపిసోడ్ లో మొదటి ప్రేమ అనుభవాలు చెప్పాలని బిగ్ బాస్ కోరగా అందులో కొందరు హౌజ్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు. సిరి తన ఫస్ట్ లవ్ గురించి చెబుతూ ఇప్పుడు తను లేడని చెప్పి ఎమోషనల్ అయ్యింది. జెస్సి తన మొదటి క్రష్ ఇప్పటికీ తనకు క్రష్ అని, ఐతే తను సింగిల్, కమిటెడ్ అనేది ఇంకా తెలియదని, ఒకవేళ సింగిల్ అయితే కనుక మింగిల్ అవ్వడానికి తాను రెడీగా ఉన్నట్లు తెలియజేసాడు.
అన్నీ మాస్టర్ మరోసారి తన మ్యాచురిటీ చూపించింది. నటరాజ్ మాస్టర్ తన భార్యతో లవ్ స్టోరీని తెలియజేసాడు. లోబో తన లవ్ స్టోరీ చెబుతూ కూడా ఎంటర్టైన్ చేసాడు. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా అనిపించింది.