Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్‌4: ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడా?

బిగ్‌బాస్‌4: ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడా?

బిగ్‌బాస్‌4: ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడా?
బిగ్‌బాస్‌4: ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతున్నాడా?

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఫైన‌ల్‌కు చేరింది. ఇన్నివారాలుగా ఎమోష‌న‌ల్ డ్రామాతో సాగుతున్న ఈ షో ఫైన‌ల్ స్టేజ్‌కి చేరుకుంది.  ఈ వారం టిక్కెట్ టు ఫినాలే మెడ‌ల్ కోసం అఖిల్‌, సోహైల్ పోటీప‌డ్డారు. ఈ పోటీలో వీరికి బిగ్‌బాస్ ఉయ్యాల టాస్క్ ఇచ్చారు. డే గ‌డుస్తున్నా వీరు ఉయ్యాల దిగ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన అభిజిత్ ఇద్ద‌రిలో ఎవ‌రు ముందుకు వెళ‌తారో మీరే డిసైడ్ చేసుకోండ‌ని చెప్ప‌డంతో ఒక్క‌సారిగా ఇద్ద‌రు ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆ త‌రువాత మాట‌ల్లో పెట్టి సోహైల్ స‌డ‌న్‌గా ఉయ్యాల దిగ‌డంతో అఖిల్ షాక్ కు గురై త‌న కోసం త్య‌గం చేసినందుకు బోరుమ‌న్నాడు.

- Advertisement -

ఆ త‌రువాత ఇద్ద‌రిని అభిజీత్ ఓదార్చాడు. దీంతో టిక్కెటు ఫినాలే మెడ‌ల్‌ని సోహైల్ త్యాగం తో అఖిల్ సొంతం చేసుకుని ఫైన‌ల్‌కి నామినేట్ అయ్యాడు. ఆ త‌రువాత అవినాష్ ఇంటి స‌భ్యుల్ని వ‌ర్ణిస్తూ చెప్పిన ఒగ్గుక‌థ హైలైట్‌గా నిలిచింది. వెంట‌నే బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు నెంబ‌ర్ గేమ్ టాస్క్ ఇచ్చాడు. ఎవ‌రు బెస్ట్ పెర్ఫార్మ‌రో.. ఎవ‌రు వ‌ర‌స్ట్ పెర్ఫార్మ‌రో  చెప్పి నెంబ‌ర్ మీద నిల‌బ‌డాలి. ఈ టాస్క్‌లో సీజ‌న్ బెస్ట్ పెర్ఫార్మ‌ర్ స్థానంలో సోహైల్‌.. వ‌ర‌స్ట్ పెర్ఫార్మ‌ర్ స్టానంలో అభిజీత్ రిల‌బ‌డ్డారు. మిగిలిన స్థానాల్లో అరియానా, మోనాల్‌, హారిక‌, అవినాష్ వున్నారు. వ‌ర‌స్ట్ పెర్ఫార్మ‌ర్‌గా అభిజీత్ ని ఎంపిక చేసిన బిగ్‌బాస్ ఇందుకు ప‌నిష్మెంట్‌గా అత‌న్ని జైలుకి పంపించాడు.

ఇదిలా వుంటే ఈ వారం ఎలిమినేష‌న్‌లో వున్న ఇంటి స‌భ్యుల్లో అవినాష్ బ‌య‌టికి రానున్న‌ట్టు స్ప‌ష్ట‌మౌతోంది. ఎలిమినేష‌న్‌లో వున్న అఖిల్‌, హారిక‌, అభిజీత్‌, మోనాల్‌ల‌లో అవినాష్ గ‌త వార‌మే ఎలిమినేట్ కావాల్సింది. బిగ్‌బాస్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కార‌ణంగా సేఫ్ అయ్యాడు. కానీ ఈ వారం బ‌య‌టికి వెళ్లిపోక త‌ప్ప‌డం లేదు. దీంతో ఈ వారం బ‌య‌టికి వ‌చ్చేది అవినాష్ అని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts