
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ మూవీని ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఆ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వరుస కథనాలు వినిపించాయి. అయితే ఇవన్నీ బిగ్ జోక్స్ అని సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌కి పై గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడబోతోంది. ఎన్టీఆర్ 30కి సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్‌ని మేకర్స్ ఈ రోజు రాత్రి 7:02 నిమిషాలకు ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎవరితో అన్న సస్పెన్స్‌కు తెరపడబోతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు త్రివిక్రమ్ ప్లేస్‌లో కొరటాల వచ్చి చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు రాత్రి అదే న్యూస్ నిజం కానున్నట్టు ఇన్ సైడ్ టాక్.