Homeటాప్ స్టోరీస్అమెజాన్ ప్రైమ్‌లో 19న‌ ‌కీర్తిసురేష్ సినిమా!

అమెజాన్ ప్రైమ్‌లో 19న‌ ‌కీర్తిసురేష్ సినిమా!

అమెజాన్ ప్రైమ్‌లో 19న‌ ‌కీర్తిసురేష్ సినిమా!
అమెజాన్ ప్రైమ్‌లో 19న‌ ‌కీర్తిసురేష్ సినిమా!

`మ‌హాన‌టి` చిత్రంతో న‌టిగా త‌న స‌త్తాను చాటుకున్నారు కీర్తిసురేష్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి న‌టిగా జేజేఅందుకున్నారు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్త‌మ న‌టిగా పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు. ఆమె న‌టించిన థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ `పెంగ్విన్‌`. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌క్కిన చిత్ర‌మిది. ఈశ్వ‌ర్ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై  కార్తీక్ సుబ్బ‌రాజు నిర్మించారు.

ఈ చిత్రాన్ని చిత్ర బృందం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తోంది.  `మ‌హాన‌టి` చిత్రానికి అమెజాన్ భారీ ఆఫ‌ర్‌ని అందించింది. అదే స్థాయిలో `పెంగ్విన్‌` చిత్రానికి కూడా భారీ ఆఫ‌ర్‌ని అందించి ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగు ప్రేక్ష‌కుల కోసం అందిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళ వెర్ష‌న్‌లోనూ ఈ చిత్రం అందుఎబాటుతో వుండ‌బోతోంది. ఈ నెల 19న అమెజాన్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు క్రేజీ చిత్రం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -

అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాతో పాటు డైరెక్ట్ స్లాట్‌లో మ‌రో ఆరు ఇత‌ర భాష‌ల‌ చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ విష‌యాన్ని అమెజాన్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆమెజాన్‌ప్రైమ్ వీడియో డైరెక్ట‌ర్‌, కంటెంట్ హెడ్ విజ‌య్ సుబ్ర‌మ‌ణియం మాట్లాడుతూ `అమెజాన్‌లో మేము వినియోగ‌దారుల మాట వింటాం. ఆ దిశ‌గా మేం ప‌నిచేస్తాం. గ‌త రెండేళ్లుగా వివిధ భాష‌ల్లో, థియేట‌ర్ల‌లో విడుద‌లైన కొద్ద వారాల‌కే కొత్త రిలీజ్‌ల‌ని చూసేందుకు ఏకైక డిజిట‌ల్  ప్లాట్ ఫామ్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో రూపు దిద్దుకుంంది. ఇప్పుడు మేము మ‌రో అడుగు ముందుకు వేశాం. అంతా ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఏడు భార‌తీయ సినిమాల‌ను ఎక్స్ క్లూజివ్‌గా ప్రైమ్ వీడియోపై ప్ర‌సారం చేయ‌నుంది. సినిమాటిక్ అనుభూతిని వారి ఇళ్ల‌ముంగిళ్ల‌లోకి తీసుకురానుంది` అన్నారు.

భార‌తీయ ప్రేక్ష‌కులు ఏడు చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. వినియోగ‌దారుల కోసం వీటిని నేరుగా రిలీజ్ చేస్తుండ‌టం ఆనందంగా వుంది. ఇంట్లోనే సుర‌క్షితంగా వుంటూ వీక్షించ‌వ‌చ్చు. 4000కు పైగా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌తో వీక్ష‌ణంతో భార‌త దేశంలో పాపుల‌ర్ అయిన అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 200కు పైగా దేశాలు, టెరిట‌రీస్‌లలో అందుబాటులో వుంది. ఈ సినిమాల‌కు అంత‌ర్జాతీయ రిలీజ్ ముద్ర‌ను అందించ‌నుంది. ఈ కార్య‌క్ర‌మం ప‌ట్ల మేమెంతో ఉద్వేగంగా వున్నాం. ఇది మా ప్రైమ్ స‌భ్యుల‌ను ఆనంద‌ప‌రుస్తుంద‌ని మేము విశ్వ‌సిస్తున్నాం` అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్ట‌ర్‌, కంట్రీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ గౌర‌వ్ గాంధీ వెల్ల‌డించారు.

అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న చిత్రాలు

`పోన్ మ‌గ‌ల్ వంధాల్` (త‌మిళం)

విడుద‌ల తేదీ మే 29 – 2020
తారాగ‌ణం : జ‌్యోతిక, పార్తీబ‌న్‌, భాగ్య‌రాజా, ప్ర‌తాప్ పోత‌న్‌, పాండ్య‌రాజ‌న్‌,
ర‌చ‌న‌, దర్శ‌‌క‌త్వం :  జె.జె. ఫ్రెడ‌రిక్‌
నిర్మాత‌లు – సూర్య‌, రాజ‌శేఖ‌ర్ క‌ర్పూర సుంద‌ర పాండ్య‌న్‌

`గులాబో సితాబో` (హిందీ)
రిలీజ్ తేదీ –  జూన్ 12, 2020
తారాగ‌ణం : అమితాబ్ బ‌చ్చ‌న్, ఆయుష్మాన్ ఖురానా
ర‌చ‌న – జూహీ చ‌తుర్వేది
ద‌ర్శ‌క‌త్వం – షూజిత్ స‌ర్కార్‌
నిర్మాత‌లు – రోన్నీ లాహిరి, శీల్ కుమార్‌

పెంగ్విన్  (త‌మిళం, తెలుగు)
రిలీజ్ తేదీ – జూన్ 19, 2020
తారాగ‌ణం –  కీర్తి సురేష్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం –  ఈశ్వ‌ర్ కార్తిక్
నిర్మాత‌లు – స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ ప‌సుబ్బ‌రాజు

లా (క‌న్న‌డ‌)
రిలీజ్ తేదీ – జూన్ 26, 2020
తారాగ‌ణం – రాగిని చంద్ర‌న్‌, సిరి ప్ర‌హ్లాద్, ముఖ్య‌మంత్రి చంద్రు,
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం – ర‌ఘు స‌మ‌ర్ధ్‌
నిర్మాత‌లు – అశ్విని, పునీత్ రాజ్‌కుమార్‌

ఫ్రెంచ్ బిర్యానీ (క‌న్న‌డ‌)
రిలీజ్ తేదీ – జూలై 24, 2020
తారాగ‌ణం – డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్‌, పిటొ బాష్‌
ర‌చ‌న – అవినాష్ బాలెక్కాల‌
ద‌ర్శ‌క‌త్వం –  ప‌న్నాగ భ‌ర‌ణ‌
నిర్మాత‌లు – అశ్విని, పునీత్ రాజ్‌కుమార్‌, గురుద‌త్ ఎ త‌ల్వార్‌,

శ‌కుంత‌లాదేవి ( హిందీ)
రిలీజ్ డేట్ ఇంకా ఖ‌రారు కాలేదు.
తారాగ‌ణం – విద్యాబాల‌న్‌
ర‌చ‌న – నాయ‌నిక మ‌హ్తిని, అనూ మీన‌న్‌
ద‌ర్శ‌క‌త్వం – అనూమీన‌న్‌
నిర్మాత‌లు – అబున్ డాంటియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి, సోనీ పిక్చ‌ర్స్ నెట్ వ‌ర్క్ ఇండియా

సుఫియాం సుజాత‌యం (మ‌ల‌యాళం)
రిలీజ్ డేట్ ఇంకా ఖ‌రారు కాలేదు.
తారాగ‌ణం – అదితిరావు హైద‌రీ, జ‌య‌సూర్య‌‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం – న‌ర‌ని పుజా ష‌న‌వాస్‌
నిర్మాణం – విజ‌య్ బాబు ప్రైడే ఫిల్మ్ హౌస్‌.

ఈ ప‌సినిమాల‌న్నీ రానున్న మూడు నెల‌ల్లో ప్రైమ్ వీడియోలో ఎక్స్ క్లూజివ్‌గా ప్ర‌సారం కానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All