Homeగాసిప్స్తారక్ ను రప్పించడానికి బిగ్ బిగ్ ప్లాన్స్

తారక్ ను రప్పించడానికి బిగ్ బిగ్ ప్లాన్స్

తారక్ ను రప్పించడానికి బిగ్ బిగ్ ప్లాన్స్
తారక్ ను రప్పించడానికి బిగ్ బిగ్ ప్లాన్స్

బిగ్ బాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ మొదలవ్వడానికి ఇంకా చాలా సమయముంది కానీ దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ వచ్చే ఏడాది మొదట్లోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. బిగ్ బాస్ లో జరిగిన మూడు సీజన్లలో ఇప్పటిదాకా ఏది బెస్ట్ అంటే భిన్న వాదనలు వినిపిస్తాయి. మొదటి సీజన్ అందరికీ కొత్త కావడంతో కొంతమందికి మొదటి సీజన్ బెస్ట్ అనిపించవచ్చు. గొడవలు తక్కువగా, ఆహ్లాదం ఎక్కువగా ఉన్న థర్డ్ సీజన్ కొంతమందికి బెస్ట్ అనిపించవచ్చు. ఇక కౌశల్ ఫ్యాన్స్ కు అయితే సెకండ్ సీజన్ బెస్ట్ అనే అభిప్రాయానికి వస్తారు. అయితే ఏ సీజన్ బెస్ట్ అంటే భిన్న వాదనలు వినిపించవచ్చేమో కానీ హోస్ట్ గా ఎవరు బెస్ట్ అంటే దాదాపు ఒకే సమాధానం వస్తుందేమో. ఇప్పటివరకూ బిగ్ బాస్ హోస్ట్ గా మూడు సీజన్లకు ముగ్గురు చేసారు. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ అవ్వగా, రెండో సీజన్ ను నాని నడిపించాడు. మూడో సీజన్ కు కింగ్ నాగార్జున రంగంలోకి దిగాడు. అయితే ఏది ఎలా ఉన్నా బిగ్ బాస్ ను బాగా నడిపించింది మాత్రం తారక్ అనే సమాధానమే బిగ్ బాస్ మూడు సీజన్లు ఫాలో అయ్యేవారు చెప్పేది.

మనకు పూర్తిగా కొత్త అయిన ఈ కాన్సెప్ట్ ను అందరికీ అర్ధమయ్యే రీతిలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించడం, తెలుగు మీద కమాండ్ తో హోస్టింగ్ చేయడం, ఎక్కడ తప్పు జరిగినా ఎండగట్టడం వంటివి తారక్ ను హాట్ ఫేవరెట్స్ ను చేసాయి. అయితే వివిధ కారణాల వల్ల మొదటి సీజన్ అయ్యాక తారక్ మళ్ళీ హోస్టింగ్ వైపు రాలేదు. సెకండ్ సీజన్ కు నానిని ఎంచుకున్నారు. అయితే తన పరిధి మేర నాని కూడా బాగానే మెప్పించినా థర్డ్ సీజన్ కు నో చెప్పేసాడు. మూడో సీజన్ కు నాగ్ ను తీసుకొచ్చారు. హుందాగా థర్డ్ సీజన్ ను నడిపించిన నాగ్ కూడా వీళ్లిద్దరి తరహాలోనే నాలుగో సీజన్ చేయలేనని చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ ప్రత్యామ్నాయాలు వెతికే పనిలో ఇప్పటినుండే పడ్డారట.

- Advertisement -

అయితే మళ్ళీ కొత్త హోస్ట్ ను వెతికే బదులు, ఫస్ట్ సీజన్ ను హోస్ట్ చేసి అందరి హాట్ ఫేవరెట్ గా మారిన ఎన్టీఆర్ ను మళ్ళీ ఒప్పించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ అయితేనే ఈ షో కు కొత్త కళ వస్తుందని అంటున్నారు. మూడో సీజన్ కొంత బోర్ కొట్టిన మాట వాస్తవం. అందుకే వచ్చే ఏడాది బిగ్ బాస్ ను మరింత ఆసక్తికరంగా, మరింత భారీ లెవెల్లో తీర్చిదిద్దుతూ, తారక్ ను కూడా రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. తారక్ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి అతణ్ణి లాక్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ మొదలయ్యే సరికి ఎన్టీఆర్ ఎలాగూ ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసి ఉంటాడు. అప్పటికి నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టినా కొంత బ్రేక్ తీసుకునే అవకాశముంటుంది. సో బిగ్ బాస్ మూడో వెర్షన్ కు ఎన్టీఆర్ ఆసక్తిగా ఉంటే ఎస్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సమాధానం ఏంటో తెలియాలంటే కొంత కాలం ఎదురుచూడక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All