Homeఎక్స్ క్లూసివ్నలుగురు హీరోల మధ్య భీకర పోరు

నలుగురు హీరోల మధ్య భీకర పోరు

Big fight in pongal raceకొత్త ఏడాది వచ్చేసింది ఇక నలుగురు హీరోల మధ్య భీకర పోరు మరో వారం రోజుల్లో మొదలు కానుంది . సంక్రాంతి బరిలో ఈసారి నలుగురు హీరోలు పోటీ పడుతున్నారు . ముందుగా జనవరి 9న నందమూరి బాలకృష్ణ నటించిన  ఎన్టీఆర్ బయోపిక్ ” ఎన్టీఆర్ కథానాయకుడు ” విడుదల అవుతోంది . ఆ మరుసటి రోజున అంటే జనవరి 10 న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” పేట ” చిత్రం విడుదల కానుంది .

జనవరి 11న రాంచరణ్ నటించిన ” వినయ విధేయ రామ ” చిత్రం విడుదల అవుతోంది , ఇక ఆ మరుసటి రోజున జనవరి 12న వెంకటేష్వరుణ్ తేజ్ నటించిన ” ఎఫ్ 2 ” చిత్రం విడుదల అవుతోంది . అంటే జనవరి 9 నుండి ప్రతీ రోజు కు ఒక సినిమా చొప్పున నాలుగు రోజుల్లో నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి దాంతో నలుగురు హీరోల మధ్య భీకరమైన పోరు సాగనుంది . ఈ నలుగురు కూడా స్టార్ హీరోలు కావడంతో మొదటగా థియేటర్ ల సమస్య రానుంది . ఆ తర్వాత అభిమానుల పోరు కూడా స్టార్ట్ కానుంది . మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అంటూ హీరోల కంటే అభిమానుల ఫైటింగ్ ఎక్కువ కానుంది . ఈ నాలుగు సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అయితే ఏ సినిమా అయితే ప్రేక్షకులకు నచ్చుతుందో ఆ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది మిగతా సినిమాలకు ఇబ్బంది తప్పకపోవచ్చు . మొత్తానికి సంక్రాంతి కి కోడి పందాల లాగా కానుంది ఈ హీరోల సినిమాల పరిస్థితి .

- Advertisement -

English Title: Big fight in pongal race

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All