
బిగ్‌బాస్ సీజన్ 4.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ. సీజన్ 3 హంగామా వైరస్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి జీన్ 4పై పడింది. దీనిక నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే సీజన్ 4 ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే నాగ్ లేకుండా ఓ ప్రోమో.. నాగ్‌తో రెండు ప్రోమోలని మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మూడు గెటప్‌లలో నాగ్ చేసిన ప్రోమో సీజన్ 4పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ రియాలిటీ ఓ ప్రారంభానికి ముందే మేకర్స్ వరుసగా లీకులు వదులుతున్నారు. భారీగా ప్రచారం అవుతున్నా అందులో ఎలాంటి నిజం లేదని కానీ, అదే నిజమని కానీ ప్రకటించడం లేదు. కావాల్సినంతగా ప్రచారం జరిగి సీన్ 4పై రచ్చ జరగాలని ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇదిలా వుంటే ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్‌లు వీళ్లంటే వీళ్లని ఈ మధ్య ప్రచారం మొదలైంది. దీనిపై కూడా మేకర్స్ సైలెన్స్‌నే మెయింటైన్ చేస్తున్నారు.
తాజాగా ఓ పది మంది పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదిఏమైనా వీరు మాత్రం ఈ సీజన్‌లో వుంటారని నెటిజన్స్ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఆ పది మంది నటి సురేఖా వాణి, సింగర్ మంగ్లీ, నందు, యంగ్ హీరో సుధాకర్ కోమాకుల, టీవి నటి సమీరా, యూట్యూబర్ మహమ్మద్ షేక్, హారిక, టివి నటుడు సయ్యద్ సోహైల్, హీరోయిన్ మోనాల్ గజ్జర్, నోయల్.. వీరితో పాటు మరో ఆరుగురు కూడా ఈ సీజన్‌లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమౌతుందన్నది తెలియాలంటే బిగ్‌బాస్ మేకర్స్ అఫీషియల్‌గా కంటెస్టెంట్‌లని ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.