Homeటాప్ స్టోరీస్కొత్త నిబంధ‌న‌ల‌తో బిగ్‌బాస్ 4!

కొత్త నిబంధ‌న‌ల‌తో బిగ్‌బాస్ 4!

big boss season 4 telugu will start august 30
big boss season 4 telugu will start august 30

మోస్ట్ స‌క్సెస్ ఫుల్ టాక్ షో బిగ్‌బాస్‌. సీజ‌న్ 3 గ‌త సీజ‌న్‌ల‌కు మించి సూప‌ర్ హిట్ కావ‌డంతో సీజ‌న్ 4పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందుకు త‌గ్గ‌ట్ఏ కంటెస్టెంట్‌ల పేర్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే గ‌తంతో పోలీస్తే ప్ర‌స్తుతం క‌రోనా  కార‌ణంగా ప్ర‌త్యేక ప‌రిస్థితులు త‌లెత్త‌డంతో బిగ్‌బాస్ సీజ‌న్ 4 వుంటుందా?  వుండ‌దా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.

ఈ పుకార్ల‌ని బ్రేక్ చేస్తూ బిగ్ బాస్ సీజ‌న్ 4 వుంటుంద‌ని, ఇందు కోసం నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇట‌వ‌లే ప్రోమోని కూడా రిలీజ్ చేయ‌డంతో బిగ్‌బాస్ సీజ‌న్ 4 పై వ‌స్తున్న రూమ‌ర్‌ల‌కు చెక్ ప‌డింది. సీజ‌న్ 3కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున నేఏ సీజ‌న్ 4కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క్లారిటీ ఇచ్చారు. తాజాగా నాగ్ పై కూడా ఓ ప్రోమోని షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ని నాగార్జున ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకోవ‌డంతో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప‌నులు ఊపందుకున్నాయ‌ని అంద‌రికి క్లారిటి వ‌చ్చేసింది.

- Advertisement -

ఇక సీజ‌న్ 4ని ఇదే నెల 30న ప్రారంభించాల‌ని మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే 16 మంది కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేశార‌ని, ఈ సీజ‌న్ మొత్తం 106 రోజులు నిర్వ‌హించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అయితే గ‌త సీజ‌న్ త‌ర‌హాలో టాస్క్‌లు మాత్రం వుండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఈ నెల 30న లేదా నాగార్జున పుట్టిన రోజైన 29న గానీ సీజ‌న్ 4ను ప్రారంభించాల‌ని భావిస్తున్నార‌ట‌. సీజ‌న్ 4పై ఇంత‌గా చ‌ర్చ జ‌రుగుతున్నా మేక‌ర్స్ మాత్రం పెద‌వి విప్ప‌డం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All