Homeటాప్ స్టోరీస్జూనియర్ అమితాబ్ “టిక్ టాక్” హ్యాక్

జూనియర్ అమితాబ్ “టిక్ టాక్” హ్యాక్

జూనియర్ అమితాబ్ “టిక్ టాక్” హ్యాక్
జూనియర్ అమితాబ్ “టిక్ టాక్” హ్యాక్

ప్రస్తుత మానవ సమాజం. దానికి “టిక్ టాక్” చేస్తున్న సేవ గురించి గతంలో ఒకసారి చెప్పుకున్నాం. తమను ఇండస్ట్రీలో ఎవరో తోక్కేసారని, బాధపడి పోయి, గతంలో రచ్చ చేసే బ్యాచ్ కి ఒక స్ట్రెస్ రిలీవర్ గా ఉపయోగపడుతోంది. ఇక చాలామంది నిజమైన ప్రతిభావంతులు కూడా టిక్ టాక్ ద్వారా మొదట ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా అవకాశాలు వస్తున్నాయి.

ఇక సినిమా తారల డై హార్డ్ ఫ్యాన్స్ కొంతమంది నిజంగా కాస్ట్యూమ్స్, మేకప్ కూడా తమ అభిమాన స్టార్స్ లాగా చేసుకుని టిక్ టాక్ విడియోలు చేస్తున్నారు. ఇక ఆయా స్టార్స్ ఫ్యాన్స్ కూడా బాగా చేసే వాళ్ళను అభిమానిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. వారిలో ఒక ముంబై వ్యక్తి అచ్చం జూనియర్ ఎన్టీఆర్ పోలికలతో ఉండి పలు షోలలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు ఉండే కోట్లమంది అభిమానులలో పూణే కు చెందిన శశికాంత్ పెద్వాల్ కూడా ఒకరు. ఈయన అచ్చం బిగ్ బి మాదిరి జుట్టు గడ్డం, కళ్ళజోడు తో సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన టిక్ టాక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసారని ఆయన వాపోతున్నారు. లక్షల్లో ఫాలోయింగ్ ఉన్న తన టిక్ టాక్ ను హ్యాక్ చెయ్యడం వల్ల, తన అభిమాన నటుడైన బిగ్ బి వీడియోలు చెయ్యలేకపోతున్నా..నంటూ ఆయన బాధపడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All