
వరుస సినిమాలతో సంచలనం సృష్టిస్తున్నారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. `పింక్` రీమేక్‌తో వరుస సినిమాలని లైన్‌లో పెట్టిన పవన్ ఒక్కో చిత్రాన్ని సైలెంట్‌గా సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో `పింక్` రీమేక్‌ని మొదలుపెట్టిన పవర్‌స్టార్ ఈ చిత్రాన్ని మెరుపు వేగంతో పూర్తి చేస్తున్నారు. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రన్నిఎట్టిపరిస్థితుల్లో
ఇదిలా వుంటే ఈ చిత్రానికి సమాంతరంగా పవన్‌కల్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో ఓ జానపద చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొఘల్ సామ్రాజ్యం నాటి పరిస్థితుల నేపథ్యంలో కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఏ.ఎం. రత్నం అత్యతం భారీ స్థాయిలో నిర్మిస్తున్నఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్‌లని నిర్మిస్తున్నారు.
ఇందులో పవన్‌కు జోడీగా ఇద్దరు కథానాయికలు లేదా ముగ్గురు నటించే అవకాశం వుందని తెలిసింది. ఇప్పటి వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రగ్యా జైస్వాల్‌ల పేర్లు వినిపించాయి. తాజాగా భూమిక పేరు చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై దర్శకుడు క్రిష్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అదికారికంగా చిత్ర బృందం ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. `ఖుషి` చిత్రంతో పవన్, భూమిక కలిసి నటించిన విషయం తెలిసిందే.