
యంగ్ టాలెంటెడ్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య బాలీవుడ్‌లో ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్‌ది ఆత్మ హత్య కాదని హత్య అని అతని అభిమానులు, శ్రేయోభిలాషులు ఇప్పటికీ వాదిస్తున్నారు. ఇక అభిమానులు మాత్రం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ లో వున్న బంధు ప్రీతి కారణంగానే మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. బీహార్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా కొంత మంది బాలీవుడ్ స్టార్స్‌పై కేసులు కూడా ఫైల్ చేయించడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా వుంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు `ఎంఎస్ ధోనీ` చిత్రంలో సోదరిగా నటించిన హీరోయిన్ భూమిక తాజాగా సుశాంత్‌పై సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. `సుశాంత్ మృతి చెంది 20 రోజులు దాటినా ఇంకా అతని జ్ఞాపకాలతోనే నిద్రలేస్తున్నాను. అతని మరణ వార్త ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. ఒకే ఒక చిత్రంలో అతనితో కలిసి నటించాను. ఇప్పటికీ నాకు ఆనాటి రోజులే గుర్తొస్తున్నాయి అని భూమిక వెల్లడించింది.
`ఇక్కడ కొనసాగడం అంత ఈజీ కాదు అది నేను అంగీకరిస్తాను. ఇది నేను అంతర్గత వ్యక్తుల గురించో లేక బయటి వ్యక్తుల గురించో చెప్పడం లేదు. మనల్ని వ్యతిరేకించే వ్యక్తుల్ని మరిచి ముందుకు సాగినప్పుడే జీవితం ఆనందమయంగా వుంటుంది. అని భూమిక సూధీర్ఘమైన పోస్ట్‌ని షేర్ చేసింది. ఫైనల్‌గా సుశాంత్ కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తానని భూమిక స్పష్టం చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై భూమిక షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.