Homeటాప్ స్టోరీస్భోళా శంకర్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది

భోళా శంకర్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది


మెగాస్టార్ చిరంజీవి తన వయసు ను సైతం పక్కనపెట్టి వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. అలాగే ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెట్టారు. ఈ క్రమంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణపరమైన బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా సినిమా తాలూకా మెగా అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో మెగా సంబరాలు నింపారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న ఉద‌యం 9 గంట‌ల 5 నిమిషాల‌కు ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్‌ కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. చిరంజీవి మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All