Homeటాప్ స్టోరీస్ర‌న్‌టైమ్ కార‌ణంగా పాట‌ని తొల‌గించార‌ట‌!

ర‌న్‌టైమ్ కార‌ణంగా పాట‌ని తొల‌గించార‌ట‌!

ర‌న్‌టైమ్ కార‌ణంగా పాట‌ని తొల‌గించార‌ట‌!
ర‌న్‌టైమ్ కార‌ణంగా పాట‌ని తొల‌గించార‌ట‌!

నితిన్ హీరోగా న‌టించిన తాజా చిత్రం `భీష్మ‌`. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో కూపొందిన ఈ చిత్రం ఇటీవ‌ల ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌లైన విష‌యం తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్నినిర్మించారు. తొలి రోజు నుంచే మంచి టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టిస్టోంది.

యుఎస్‌తో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబట్టింది. నితిన్ న‌ట‌న‌, ర‌ష్మిక గ్లామ‌ర్‌, వెంకీ కుడుముల టేకింగ్ లండ్ డైలాగ్స్ ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేశాయి. దీంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఊహించిన స్థాయి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో టీమ్ ఇటీవ‌ల సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటని చిత్ర బృందం రిలీజ్ చేస్తోంది. నిడివి ఎక్కువ కావ‌డం వ‌ల్ల ఈ మూవీ కోసం చిత్రీక‌రించిన `హేయ్‌ చూసా.. అంటూ సాగే సాంగ్ వీడియోని తొల‌గించామ‌ని, ఆ పాట‌కు సంబంధించిన వీడియోని మంగ‌ళ‌వారం సాయంత్రం రిలీజ్ చేస్తున్నామ‌ని చిత్ర బృందం వెల్ల‌డించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All